YouTube పెయిడ్ ప్రోడక్ట్‌లకు సంబంధించిన ధర మార్పుల గురించి తెలుసుకోండి

మార్కెట్‌లో జరిగే మార్పులకు అనుగుణంగా, అప్పుడప్పుడూ మేము మా మెంబర్‌షిప్ ధరలను అప్‌డేట్ చేస్తుంటాము, ఇందులో ద్రవ్యోల్బణం, స్థానిక పన్నులో మార్పుల వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.

ప్రస్తుతం మీకు విధించే ధరను తెలుసుకోవడానికి లేదా మీకు బిల్లు ఎలా విధించబడుతుందో అర్థం చేసుకోవడానికి, మీ ఖాతా నుండి కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌ల పేజీకి వెళ్లండి. మీరు మీ మెంబర్‌షిప్‌ను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.

నాకు విధించే ధర మారుతుందో, లేదో నాకు ఎలా తెలుస్తుంది?

మీ దేశం/ప్రాంతంలో ధర పెరగడానికి కనీసం 30 రోజుల ముందే మేము మీకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తాము.

స్థానిక పన్నులో మార్పులు జరగవచ్చని, దాని ఫలితంగా మీ మొత్తం ధర పెరగవచ్చని గమనించండి. రిపీట్ అయ్యే మీ మెంబర్‌షిప్‌ల ప్రస్తుత ధర ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటానికి, మీ ఖాతా నుండి కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌ల పేజీకి వెళ్లండి.

నేను పొందే సర్వీస్‌కు అంతరాయం కలుగుతుందా?

మీరు మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసే వరకు ఈ మార్పు వల్ల మీ ప్రీమియం సర్వీస్‌కు అంతరాయం ఉండదు. అయితే, కొన్ని దేశాలు/ప్రాంతాల్లో, మీరు మీ మెంబర్‌షిప్‌ను కొనసాగించడానికి ధర మార్పులను గుర్తించి, ఆమోదించాల్సి రావచ్చు.
మీ మెంబర్‌షిప్ స్టేటస్‌ను చెక్ చేయడానికి, మీ కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌ల పేజీకి వెళ్లండి. ధర మార్పును గుర్తించడానికి చర్య అవసరమైతే, మీరు మీ మెంబర్‌షిప్ వివరాలలో నోటీసును కనుగొంటారు.
మీ మెంబర్‌షిప్ రద్దు చేయబడితే, మీరు youtube.com/premiumలో మళ్లీ సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

మీరు ఎప్పటి నుండి నాకు కొత్త ధరను విధించడం ప్రారంభిస్తారు?

కొత్త మెంబర్‌లకు, సైన్ అప్ చేసిన తర్వాత, ఆఫర్‌లో ప్రదర్శించబడిన ధర విధించబడుతుంది.

ఇప్పటికే ఉన్న మెంబర్‌లకు, మేము ప్లాన్ ధరను పెంచిన కనీసం 30 రోజుల తర్వాత వచ్చే మొదటి బిల్లింగ్ కాల వ్యవధిలో మీ కొత్త నెలవారీ ధర ఛార్జ్ చేయబడుతుంది. ఉదాహరణకు, కొత్త మెంబర్‌లకు మేము సెప్టెంబర్ 1న ధర పెంచితే, అక్టోబర్‌లో మీ తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధి వరకు మీకు పెంచిన ధర ఛార్జ్ చేయబడదు.

ఈ మెంబర్‌షిప్ పాజ్ చేయబడితే, దాన్ని తిరిగి మీరు కొనసాగించే వరకు మీకు ఛార్జీ విధించబడదు. మీకు మీ మునుపటి ధర ఒకసారి బిల్ చేయబడుతుంది, ఆపై తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధులకు కొత్త ధర బిల్ చేయబడుతుంది.

ప్రస్తుతం నాకు విధించే ధరను నేను ఎక్కుడ చూడవచ్చు?

ప్రస్తుతం మీకు విధించే ధరను తెలుసుకోవడానికి లేదా మీకు బిల్లు ఎలా విధించబడుతుందో అర్థం చేసుకోవడానికి, మీ ఖాతాలోని కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌ల పేజీకి వెళ్లండి.

నేను నా ప్లాన్‌ను మార్చుకోవచ్చా?

మీరు మీ మెంబర్‌షిప్‌లను ఎప్పుడైనా చూడవచ్చు, మేనేజ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. మీ ప్లాన్‌ను మార్చుకోవడానికి, మీ ఖాతాలోని కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌ల పేజీకి వెళ్లండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12856777545101881827
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false