YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను మేనేజ్ చేయండి

ఫ్యామిలీ మేనేజర్ అవ్వడానికి, YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను సెటప్ చేయండి. ఫ్యామిలీ మేనేజర్‌గా, మీ YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌షిప్‌ను మీరు షేర్ చేయవచ్చు. మీ ఫ్యామిలీలో గరిష్ఠంగా 5 మంది ఇతర ఫ్యామిలీ మెంబర్‌లతో మీ మెంబర్‌షిప్‌ను మీరు షేర్ చేయవచ్చు. మీరు ఫ్యామిలీ మెంబర్ అయితే, YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను షేర్ చేసుకోవడానికి మీరు ఫ్యామిలీ గ్రూప్‌లో చేరవచ్చు. 

గమనిక: ఇప్పటికే ఉన్న Google ఫ్యామిలీ గ్రూప్‌లో మీరు మెంబర్ అయితే, మీరు YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను కొనుగోలు చేయలేరు. మీ ఫ్యామిలీ గ్రూప్‌నకు చెందిన మేనేజర్ మాత్రమే కొనుగోలు చేయగలరు.

మీరు ప్రారంభించడానికి ముందు తెలుసుకోవాల్సిన అంశాలు

  • YouTube ఫ్యామిలీ ప్లాన్‌ను షేర్ చేసుకునే ఫ్యామిలీ మెంబర్‌లు అందరూ తప్పనిసరిగా ఫ్యామిలీ మేనేజర్ ఉన్న అదే ఫ్యామిలీతో కలిసి ఉండాలి. ఫ్యామిలీ గ్రూప్ ఆవశ్యకాల గురించి మరింత తెలుసుకోండి అలాగే మీరు మీ ఫ్యామిలీ ప్లాన్‌ను సెటప్ చేస్తున్నప్పుడు ఎర్రర్‌లు ఎదురైతే ఏమి చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి. 
  • మీరు ప్రతి 12 నెలలకు ఒకసారి మాత్రమే ఫ్యామిలీ గ్రూప్‌లను మార్చగలరు.
  • ప్రతి ఫ్యామిలీ మెంబర్ పేరు, ఫోటో, ఇమెయిల్ అడ్రస్, గ్రూప్‌తో షేర్ చేయబడతాయి.
  • మీ YouTube TV ఫ్యామిలీ ప్లాన్‌కు సంబంధించి సహాయం అవసరమైతే, మీరు ఎప్పుడైనా సపోర్ట్‌ను సంప్రదించవచ్చు. 

YouTube, YouTube TVలో ఫ్యామిలీ గ్రూప్‌లను క్రియేట్ చేయడం ఎలా

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

ఫ్యామిలీ మేనేజర్‌లు: సైన్ అప్ చేసి, ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడం

కొత్త YouTube Premium లేదా Music Premium మెంబర్‌లు

ప్రారంభించడానికి, 18 సంవత్సరాలు లేదా అంత కన్నా ఎక్కువ వయస్సు ఉన్న ఫ్యామిలీ మేనేజర్‌ను ఎంచుకోండి. ఫ్యామిలీ ప్లాన్‌ను కొనుగోలు చేయగల లేదా మెంబర్‌షిప్ నిర్ణయాలను తీసుకోగల ఏకైక వ్యక్తి, ఫ్యామిలీ మేనేజర్. YouTube పెయిడ్ మెంబర్‌షిప్ కోసం సైన్ అప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

YouTube Premium లేదా Music Premium మెంబర్‌షిప్ కోసం సైన్ అప్ చేసి, ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడానికి:

  1. YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. మీకు YouTube Music Premiumకు, అలాగే YouTube Premiumకు సంబంధించిన పెయిడ్ మెంబర్‌షిప్ ఆప్షన్‌లు కనిపిస్తాయి. మీరు ఏ సబ్‌స్క్రిప్షన్‌ను అయితే కొనుగోలు చేయాలనుకుంటున్నారో, దానికి సంబంధించిన సమాచారం కోసం మరింత తెలుసుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. లేదా ఫ్యామిలీ లేదా విద్యార్థి ప్లాన్‌తో డబ్బు ఆదా చేసుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. ఫ్యామిలీ ప్లాన్‌ను పొందండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఇప్పటికే ఉన్న ఒక Google ఫ్యామిలీ గ్రూప్‌నకు మీరు ఫ్యామిలీ మేనేజర్ అయితే, మీ ఫ్యామిలీ గ్రూప్‌ను నిర్ధారిస్తూ మీకు ఒక డైలాగ్ కనిపిస్తుంది. కొనుగోలును కొనసాగించడానికి కొనసాగండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి, ఆపై ఇప్పటికే ఉన్న మీ ఫ్యామిలీ గ్రూప్‌నకు చెందిన మెంబర్‌లతో మీ ఫ్యామిలీ ప్లాన్‌ను షేర్ చేయండి. 5వ దశ మీకు వర్తించకపోతే, 6వ దశకు స్కిప్ చేయండి.
  6. మీకు ఇప్పటికే ఒక Google ఫ్యామిలీ గ్రూప్ లేకపోతే, ముందు మీరు సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయడానికి, సంబంధిత దశలను ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేయడానికి సంబంధించిన ప్రాసెస్‌ను మీకు గైడ్ చేయడం జరుగుతుంది.
గమనిక: ఫ్యామిలీ ప్లాన్‌కు సైన్ అప్ చేయడంలో మీకు ఏదైనా సమస్య ఎదురవుతుంటే, మీకు ఒకటి కంటే ఎక్కువ Google Play పేమెంట్స్ ప్రొఫైల్స్ ఉండటం అందుకు కారణం కావచ్చు. అలా ఉంటే, మీ దేశం/ప్రాంతం ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం లేదా మార్చడం ఎలాగో తెలుసుకోండి.

ఇప్పటికే ఉన్న YouTube Premium లేదా Music Premium మెంబర్‌లు

మీ వ్యక్తిగత Premium లేదా Music Premium మెంబర్‌షిప్‌ను ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి:
  1. YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. ఫ్యామిలీ ప్లాన్‌ను పొందండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫ్యామిలీ ప్లాన్‌ను పొందండి అనే ఆప్షన్‌ను మళ్లీ ట్యాప్ చేయండి.
  4. కొనుగోలు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీ Google ఫ్యామిలీ గ్రూప్‌ను సెటప్ చేసుకోండి.
    • ఇప్పటికే ఉన్న ఒక Google ఫ్యామిలీ గ్రూప్‌నకు మీరు ఫ్యామిలీ మేనేజర్‌గా ఉన్నారా? కొనసాగించడానికి, కొనసాగండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి, ఆపై ఇప్పటికే ఉన్న మీ ఫ్యామిలీ గ్రూప్‌నకు చెందిన మెంబర్‌లతో YouTube Premiumను షేర్ చేయండి.
    • మీరు Google ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేస్తున్నారా? ఫ్యామిలీ గ్రూప్‌ను సెటప్ చేయడానికి:
      • మీ ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి గరిష్ఠంగా అయిదుగురు ఫ్యామిలీ మెంబర్‌లను ఆహ్వానించండి, వారికి ఈమెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఆహ్వానాలను పంపండి.
      • పంపండిని ఎంచుకోండి.
      • ఫ్యామిలీ మెంబర్‌లకు ఒక ఆహ్వానం అందుతుంది. వారు ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ఎంచుకుని, తమ ఖాతాను నిర్ధారించవచ్చు.
      • మీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఫ్యామిలీ మెంబర్‌లు ఫ్యామిలీ గ్రూప్‌లో చేరుతారు, వారికి YouTube Premiumకు యాక్సెస్ ఉంటుంది.
    • ఇప్పటికే ఉన్న ఒక Google ఫ్యామిలీ గ్రూప్‌లో మీరు ఫ్యామిలీ మెంబర్‌గా ఉన్నారా? మీరు YouTube Premiumను కొనుగోలు చేయలేరు, కానీ ఆ కొనుగోలు చేయవలసిందిగా మీ ఫ్యామిలీ మేనేజర్‌ను మీరు అడగవచ్చు.
గమనికలు:
  • ప్రత్యేక ఆఫర్‌లను, YouTube ఫ్యామిలీ ప్లాన్‌లకు బదిలీ చేయడం సాధ్యపడదు. మీరు 1 నెల కన్నా ఎక్కువ వ్యవధి ఉన్న ట్రయల్ సమయంలో ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకున్నట్లయితే, మీ ట్రయల్ 1 నెలకు కుదించబడుతుంది. మీ ఫ్యామిలీ ప్లాన్‌ను మీరు తర్వాత రద్దు చేసుకుంటే, మీ ట్రయల్‌ను మీరు మళ్లీ ఉపయోగించలేరు. మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను అప్‌డేట్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
  • ఫ్యామిలీ ప్లాన్‌కు సైన్ అప్ చేయడంలో మీకు ఏదైనా సమస్య ఎదురవుతుంటే, మీకు ఒకటి కంటే ఎక్కువ Google Play పేమెంట్స్ ప్రొఫైల్స్ ఉండటం అందుకు కారణం కావచ్చు. అలా ఉంటే, మీ దేశం/ప్రాంతం ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయడం లేదా మార్చడం ఎలాగో తెలుసుకోండి.
  • మీకు వార్షిక ప్లాన్ ఉన్నట్లయితే, ఫ్యామిలీ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి ముందు మీ వార్షిక ప్లాన్ గడువు ముగిసే వరకు వేచి ఉండాలి.

ఫ్యామిలీ మేనేజర్‌లు: ఫ్యామిలీ మెంబర్‌లను జోడించడం లేదా తీసివేయడం

ఫ్యామిలీ మెంబర్‌లను జోడించడం

మీరు ఫ్యామిలీ మేనేజర్ అయితే, మీ ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి గరిష్ఠంగా అయిదుగురు ఫ్యామిలీ మెంబర్‌లను మీరు ఆహ్వానించవచ్చు.
ఫ్యామిలీ మెంబర్‌ను జోడించడం:
  1. మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌తో అనుబంధించబడిన Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. ఫ్యామిలీ షేరింగ్ సెట్టింగ్‌లకు పక్కన ఉండే ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఫ్యామిలీ మెంబర్‌లను ఆహ్వానించండిని ట్యాప్ చేయండి.
  5. మీరు ఏ వ్యక్తిని అయితే ఆహ్వానించాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  6. పంపండిని ఎంచుకోండి. ఎవరైనా మీ ఫ్యామిలీలో చేరినప్పుడు మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ అందుతుంది.

ఫ్యామిలీ మెంబర్‌లను తీసివేయడం

మీరు ఫ్యామిలీ మేనేజర్ అయితే, ఏ సమయంలోనైనా మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి మీరు వ్యక్తులను తీసివేయవచ్చు.
ఫ్యామిలీ మెంబర్‌ను తీసివేయడం:
  1. మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌తో అనుబంధించబడిన Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. YouTube యాప్‌లో, మీ ప్రొఫైల్ ఫోటోపై ట్యాప్ చేయండి ఆ తర్వాత కొనుగోళ్లు, మెంబర్‌షిప్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ మెంబర్‌షిప్‌పై ట్యాప్ చేయండి.
  4. ఫ్యామిలీ షేరింగ్ సెట్టింగ్‌లకు పక్కన ఉండే ఎడిట్ చేయండిని ట్యాప్ చేయండి.
  5. మీరు తీసివేయాలనుకుంటున్న వ్యక్తి పేరును ఎంచుకోండి.
  6. మెంబర్‌ను తీసివేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఫ్యామిలీ మేనేజర్‌లు: ఫ్యామిలీ మేనేజర్‌కు సంబంధించిన ఇతర టాస్క్‌లు

మీ పేమెంట్ ఆప్షన్‌ను మార్చండి

పేమెంట్ ఆప్షన్‌తో పాటు మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయండి

మీరు ఎప్పుడైనా మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు. మీరు రద్దు చేసుకున్నా కూడా, మీ నెలవారీ బిల్లింగ్ కాల వ్యవధి ముగిసే దాకా మీ YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌నకు మీకు యాక్సెస్ ఉంటుంది. బిల్లింగ్ కాల వ్యవధి ముగిశాక, ఫ్యామిలీ మెంబర్‌లందరూ పెయిడ్ మెంబర్‌షిప్‌నకు యాక్సెస్ కోల్పోతారు, కానీ వారి Google ఖాతాలు మాత్రం అలాగే ఉంటాయి.

 ఫ్యామిలీ మెంబర్‌లు: ఫ్యామిలీ గ్రూప్‌లోకి చేరడం లేదా దాని నుండి బయటకు వచ్చేయడం

ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడం

YouTube పెయిడ్ మెంబర్‌షిప్ గల ఫ్యామిలీ మేనేజర్, ఫ్యామిలీ గ్రూప్‌లో చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తే, మీకు ఈమెయిల్ ఆహ్వానం లేదా టెక్స్ట్ మెసేజ్ ఆహ్వానం అందుతుంది. ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి, ఆహ్వానంలో ఉన్న సూచనలను ఫాలో అవ్వండి.
ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడం గురించి మరింత తెలుసుకోండి.

ఫ్యామిలీ గ్రూప్ నుండి వైదొలగడం లేదా వ్యక్తిగతంగా YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను పొందడం

ఫ్యామిలీ గ్రూప్‌ల నుండి వైదొలగడం లేదా ఒక దాని నుండి మరొక దానికి మారడం ఎలా అనే దాని గురించి తెలుసుకోండి. మీ సొంత YouTube పెయిడ్ మెంబర్‌షిప్‌ను పొందడానికి:
  1. మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి వైదొలగడానికి సంబంధించిన సూచనలను ఫాలో అవ్వండి.
  2. మీ సొంత YouTube పెయిడ్ మెంబర్‌షిప్ కోసం సైన్ అప్ చేయండి.
గమనిక: మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి మీరు వైదొలిగిన్నట్లయితే, వేరే ఫ్యామిలీ గ్రూప్‌లో చేరడానికి వచ్చిన ఆహ్వానాన్ని మీరు అంగీకరించవచ్చు లేదా మీ సొంత గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్రతి 12 నెలలకు ఒకసారి మాత్రమే ఫ్యామిలీ గ్రూప్‌లను మార్చగలరు. మీరు ఒక ఫ్యామిలీ గ్రూప్ నుండి వైదొలిగి, ఒక కొత్త ఫ్యామిలీ గ్రూప్‌లో చేరితే, 12 నెలల పాటు మీరు మరొక ఫ్యామిలీ గ్రూప్‌లో చేరలేరు.

ఫ్యామిలీ ప్లాన్‌లకు సంబంధించిన లొకేషన్ ఆవశ్యకతలు

ఫ్యామిలీ ప్లాన్‌కు సంబంధించిన లొకేషన్ ఆవశ్యకతలు

YouTube ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ను షేర్ చేసే అర్హతను పొందడానికి, ఫ్యామిలీ మేనేజర్ ఏ రెసిడెన్షియల్ అడ్రస్‌లో అయితే నివసిస్తున్నారో, ప్రతి ఫ్యామిలీ మెంబర్ కూడా తప్పనిసరిగా అదే అడ్రస్‌లో నివసిస్తూ ఉండాలి. ప్రతి 30 రోజులకు ఒకసారి, ఒక ఎలక్ట్రానిక్ చెక్ ఇన్ ద్వారా ఈ ఆవశ్యకతను నిర్ధారించడం జరుగుతుంది.

మీ ఫ్యామిలీ ప్లాన్‌ను సెటప్ చేసుకోవడంలో సమస్యను ఎదుర్కొంటున్నారా? మీకు ఈ కింద పేర్కొన్న ఎర్రర్ మెసేజ్ వచ్చినట్లయితే:

  • "ఫ్యామిలీకి సపోర్ట్ లేదు"

లేదా

  • "దేశానికి సపోర్ట్ లేదు"

మీ Google Pay ఖాతాలో లిస్ట్ చేసి ఉన్న దేశం/ప్రాంతం, మీ ప్రస్తుత లొకేషన్‌తో మ్యాచ్ అవుతూ ఉండకపోవచ్చు.

మీ ప్రస్తుత లొకేషన్‌కు మ్యాచ్ అయ్యేలా మీ Google Pay ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయండి, ఆ తర్వాత మీ ఫ్యామిలీ ప్లాన్‌ను సెటప్ చేయడం కొనసాగించండి.

ఏ ఫ్యామిలీ మెంబర్ దేశం/ప్రాంతం లొకేషన్ అయినా మీ లొకేషన్‌తో మ్యాచ్ అవ్వకపోతే, వారు ఫ్యామిలీ గ్రూప్‌లో చేరలేరు.

మీ YouTube ఫ్యామిలీ ప్లాన్‌కు సంబంధించి మీకు ఏదైనా సహాయం అవసరమైతే, మీరు ఏ సమయంలో అయినా సపోర్ట్‌ను సంప్రదించండి.

మీ YouTube TV ఫ్యామిలీ ప్లాన్‌కు సంబంధించి మీకు సహాయం అవసరమైతే, మీరు ఏ సమయంలో అయినా సపోర్ట్‌ను సంప్రదించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11654728653036240822
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false