YouTube Premiumతో ఆఫ్‌లైన్‌లో వీడియోలను చూడండి

YouTube Premium మీ లొకేషన్‌లో అందుబాటులో ఉంటే, మీ మొబైల్ పరికరంలో మీరు వీడియోలను డౌన్‌లోడ్ చేయవచ్చు, చూడవచ్చు. Chrome, Edge, Firefox & Opera బ్రౌజర్‌లను ఉపయోగించి మీ కంప్యూటర్‌లోనూ మీరు వీడియోలను డౌన్‌లోడ్ చేయవచ్చు. ఇతర బ్రౌజర్‌లలోనూ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామనే నమ్మకంతో ఉన్నాము.

ప్రారంభించడానికి, మీ YouTube Premium డౌన్‌లోడ్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయడం లేదా YouTube Premiumకు సైన్ అప్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఆఫ్‌లైన్‌లో చూడటానికి వీడియోలను డౌన్‌లోడ్ చేయండి

మీ కంప్యూటర్‌లో వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి:

  1. సైన్ ఇన్ చేసిన మీ YouTube Premium ఖాతా నుండి youtube.com కు వెళ్లండి.
  2. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియో వీక్షణా పేజీకి వెళ్లండి.
  3. వీడియో కింద, డౌన్‌లోడ్ చేయండి ని క్లిక్ చేయండి.

వీడియో డౌన్‌లోడ్ అయిన తర్వాత, వీడియో కింద ఉన్న డౌన్‌లోడ్ చిహ్నం నలుపు రంగులోకి మారుతుంది.

వీడియోలను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు మీ పరికరం ఇంటర్నెట్ కనెక్షన్‌ను కోల్పోతే, తిరిగి ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన వెంటనే డౌన్‌లోడ్ ప్రోగ్రెస్ ఆటోమేటిక్‌గా కొనసాగుతుంది.

డౌన్‌లోడ్‌ చేసిన వీడియోలను చూడండి

మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసిన వీడియోలను కనుగొని, చూడడానికి:

  1. సైన్ ఇన్ చేసిన ఖాతా నుండి youtube.com కు వెళ్లండి.
  2. ఎడమ వైపు మెనూలో డౌన్‌లోడ్‌లు ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

మీ డౌన్‌లోడ్‌ల నుండి ఒక్కో వీడియోను తీసివేయండి

డౌన్‌లోడ్ చేసిన వీడియోలను మీరు రెండు పద్ధతుల్లో తీసివేయవచ్చు:

  1. వీడియో ప్లేయర్ కింద, మీరు తీసివేయాలనుకుంటున్న వీడియో పక్కన డౌన్‌లోడ్ చేయబడింది పై ట్యాప్ చేయండి.
  2. తొలగించండిని క్లిక్ చేయండి.

లేదా

  1. మీ డౌన్‌లోడ్‌ల పేజీ కి వెళ్లండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న వీడియో పక్కన ఉన్న మరిన్ని '' ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. డౌన్‌లోడ్‌ల నుండి తీసివేయండి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  4. "అన్ని డౌన్‌లోడ్‌లనూ తొలగించాలా?" అనే డైలాగ్‌లో తొలగించండి అనే బటన్‌ను క్లిక్ చేయండి

డౌన్‌లోడ్ చేసిన అన్ని వీడియోలను తీసివేయండి

మీరు డౌన్‌లోడ్ చేసిన వీడియోలను ఈ కింది దశలను ఫాలో అవడం ద్వారా చూడవచ్చు, తొలగించవచ్చు:

  1. ఎడమ వైపు మెనూలో డౌన్‌లోడ్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. డౌన్‌లోడ్ సెట్టింగ్స్ ఆ తర్వాత అన్ని డౌన్‌లోడ్‌లను తొలగించండి ఆప్షన్‌లపై ట్యాప్ చేయండి.
  3. "అన్ని డౌన్‌లోడ్‌లనూ తొలగించాలా?" అనే డైలాగ్‌లో తొలగించండి అనే బటన్‌ను క్లిక్ చేయండి

డౌన్‌లోడ్ సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయండి

సెట్టింగ్స్ ఆ తర్వాత డౌన్‌లోడ్‌లు ఆ తర్వాత డౌన్‌లోడ్ క్వాలిటీ ఆప్షన్‌లకు వెళ్లి, మీ డౌన్‌లోడ్‌ల కోసం ఆటోమేటిక్ క్వాలిటీని సెట్ చేయండి.

అధిక క్వాలిటీ వీడియోలు ఎక్కువ డేటాను వినియోగించవచ్చు, డౌన్‌లోడ్‌ల విభాగంలో కనిపించేందుకు వాటికి ఎక్కువ సమయం పట్టవచ్చు, ఇంకా మీ పరికరంలో ఎక్కువ స్పేస్‌ను తీసుకోవచ్చు.

వీడియోలను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను పరష్కరించండి

  • డౌన్‌లోడ్ చేసిన వీడియోలను 29 రోజుల వరకు ఆఫ్‌లైన్‌లో ప్లే చేయవచ్చు. ఆ తర్వాత, మీ పరికరాన్ని ఇంటర్నెట్‌కు మీరు మళ్లీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ కనెక్ట్ చేయడం అనేది వీడియోలో మార్పులు లేదా దాని లభ్యతను చెక్ చేయడం కోసం యాప్‌ను అనుమతిస్తుంది. వీడియో ఇక మీదట ఆఫ్‌లైన్ ప్లేబ్యాక్ కోసం అందుబాటులో లేకపోతే, అది తర్వాత సింక్ చేసే సమయంలో మీ పరికరం నుండి తీసివేయబడుతుంది.
  • కొన్ని దేశాలు/ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా 48 గంటల వరకు కంటెంట్‌ను ప్లే చేయవచ్చు. వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి మీరు మీ Premium ఖాతాకు తప్పక సైన్ ఇన్ చేయాలి. ఏ ఖాతాతో అయితే మీ డౌన్‌లోడ్‌లకు వీడియోలను జోడించారో, వాటిని ప్లే చేయడానికి అదే ఖాతాలో సైన్ ఇన్ చేసి ఉండాలి. కామెంట్ చేయడం అలాగే లైక్ చేయడం వంటి కొన్ని ఫీచర్‌లు, మీ పరికరం Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడి ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటాయి. YouTube ఆఫ్‌లైన్ వీడియోల గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12417068159759921735
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false