మీ Premium మెంబర్‌షిప్‌ను పాజ్ చేయండి లేదా కొనసాగించండి

YouTube Premium, YouTube Music Premium సబ్‌స్క్రయిబర్‌లు తమ పెయిడ్ మెంబర్‌షిప్ వ్యవధిలో ఎప్పుడైనా పాజ్ చేయవచ్చు, కొనసాగించవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను చూడటానికి, అలాగే మేనేజ్ చేయడానికి కింద ఉన్న బటన్‌ను నొక్కండి. ఆ తర్వాత, YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌షిప్‌ను పాజ్ చేయడానికి లేదా కొనసాగించడానికి ఈ ఆర్టికల్‌లో ఉన్న దశలను ఫాలో అవ్వండి.

గమనిక: వార్షిక ప్లాన్‌లను పాజ్ చేయడం సాధ్యం కాదు. మీ పెయిడ్ మెంబర్‌షిప్‌ను పాజ్ చేసే ఆప్షన్, అలాగే కొనసాగించే ఆప్షన్ Apple ద్వారా బిల్ చేయబడిన యూజర్‌లకు అందుబాటులో లేవు.

మీ మెంబర్‌షిప్‌ను పాజ్ చేయడం ఎలా

 

ఇప్పుడే పాజ్ చేయండి

  1. youtube.com/paid_memberships‌కు వెళ్లండి.
  2. మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.​
  3. డీయాక్టివేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. బదులుగా, పాజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. స్లయిడర్‌ను ఉపయోగించడానికి మీ మెంబర్‌షిప్‌ను ఎన్ని నెలలు పాజ్ చేయాలనుకుంటున్నారో ఎంచుకుని, ఆపై, మెంబర్‌షిప్‌ను పాజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ మెంబర్‌షిప్‌ను మీరు పాజ్ చేసినప్పుడు:

  • ఈ పాజ్‌లో ఉండే సమయాన్ని 1 నుండి 6 నెలల వరకు ఎంచుకోవచ్చు.
  • మీ ప్రస్తుత బిల్లింగ్ కాల వ్యవధి ముగిసిన తర్వాత, మీ మెంబర్‌షిప్ పాజ్ చేయబడుతుంది.
  • మీ మెంబర్‌షిప్ పాజ్ చేయబడిన సమయంలో, మీకు (ఇంకా మీ ప్లాన్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్‌లు ఎవరికీ) YouTube Premium లేదా YouTube Music Premium ప్రయోజనాలు వేటికీ యాక్సెస్ ఉండదు.
  • పాజ్‌లో ఉన్న సమయంలో, మీరు ఎప్పుడైనా మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేయవచ్చు.
  • మీకు YouTube Premium సబ్‌స్క్రిప్షన్ ఉంటే, మీరు డౌన్‌లోడ్ చేసిన వీడియోలు లేదా మ్యూజిక్ ఏవైనా మినహాయించబడతాయి. మీరు మీ మెంబర్‌షిప్‌ను కొనసాగించేంత వరకు మీరు వాటిని యాక్సెస్ చేయలేరు.
  • మీకు YouTube Music Premium సబ్‌స్క్రిప్షన్ ఉంటే, మీరు డౌన్‌లోడ్ చేసిన మ్యూజిక్ ఏదైనా కొనసాగించబడుతుంది. మీరు మీ మెంబర్‌షిప్‌ను కొనసాగించేెంత వరకు మీరు వాటిని యాక్సెస్ చేయలేరు.
  • మీ పాజ్ చేయబడిన స్టేటస్ ముగిసిన తర్వాత, మీ తర్వాతి నెల సర్వీస్‌కు సంబంధించి, సాధారణంగా నెలకు మీకు ఎంత ఛార్జీ అయితే విధించబడుతుందో, ఆటోమేటిక్‌గా అంతే ఛార్జీ విధించబడుతుంది. మీ మెంబర్‌షిప్ పాజ్‌లో ఉన్నప్పుడు, మీ ప్లాన్ ధర మారితే, కొత్త ధరకు మారే ముందు, ఒక్కసారికి మాత్రం మీకు పాత ధర ఛార్జీ చేయబడుతుంది. మీ దేశం/ప్రాంతంలో ధర పెరగడానికి కనీసం 30 రోజుల ముందే మేము ఈమెయిల్ ద్వారా మీకు ఆ సంగతి తెలియజేస్తాము.
  • మీరు YouTubeకు వెళ్లి, మెంబర్‌షిప్ కొనసాగడం కోసం ఏ తేదీ అయితే షెడ్యూల్ చేయబడిందో, ఆ తేదీకి ముందే ఎప్పుడైనా మీ మెంబర్‌షిప్‌ను అన్‌పాజ్ చేసి, కొనసాగించవచ్చు.

మీ మెంబర్‌షిప్‌ను కొనసాగించడం ఎలా

 

ఇప్పుడే కొనసాగించండి

  1. youtube.com/paid_memberships‌కు వెళ్లండి.
  2. మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మళ్లీ కొనసాగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

 

Pixel Pass సబ్‌స్క్రిప్షన్ ద్వారా మీరు YouTube Premiumను పొందినట్లయితే, మీ ఖాతాను ఎలా మేనేజ్ చేయాలో ఇక్కడ మరింత తెలుసుకోండి.
2022 నుండి, Androidలో సైన్ అప్ చేసిన కొత్త YouTube Premium, Music Premium సబ్‌స్క్రయిబర్‌లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రయిబర్‌లు ఈ మార్పు వల్ల ప్రభావితం అవ్వరు. ఇటీవలి ఛార్జీలను చూడటానికి, అలాగే మీకు ఎలా బిల్ చేయబడుతుందో చెక్ చేయడానికి మీరు payments.google.com‌కు వెళ్లవచ్చు. Google Play కొనుగోలుకు సంబంధించిన రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, ఇక్కడ వివరించిన దశలను ఫాలో అవ్వండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
కంప్యూటర్ Android
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10401588680873195303
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false