YouTube వార్షిక ప్లాన్ కోసం సైన్ అప్ చేయండి

Premium వార్షిక ప్లాన్‌లు అనేవి ప్రీపెయిడ్, రిపీట్ కాని మెంబర్‌షిప్‌లు. మీరు సబ్‌స్క్రయిబ్ అయ్యాక, మీ ప్లాన్ గడువు ముగిసే దాకా మీరు 12 నెలల పాటు Premium మెంబర్‌షిప్ ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. అర్హత వివరాల కోసం కింద చూడండి.

మీరు వార్షిక ప్లాన్‌కు అర్హులో, కాదో చెక్ చేయండి

వార్షిక ప్లాన్‌కు సైన్ అప్ చేయడానికి, కింది దశలను ఫాలో అవ్వండి. మీ కొనుగోలును పూర్తి చేసిన తర్వాత, మీ మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేయడానికి ఉపయోగించిన Google ఖాతాతో మీరు—అనుకూలమైన స్మార్ట్ టీవీలు/గేమింగ్ కన్సోల్స్‌తో సహా, ఎక్కడ అయినా సైన్ ఇన్ చేసి మీ YouTube Premium లేదా YouTube Music Premium ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు.

వార్షిక ప్లాన్ కోసం సైన్ అప్ చేయడానికి, మీరు తప్పనిసరిగా ఈ కింద ఉన్న వాటికి అనుగుణంగా ఉండాలి:

  • ప్రస్తుతం YouTube Premium లేదా Music Premium సబ్‌స్క్రయిబర్ అయి ఉండకూడదు. మీకు ఇప్పటికే YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్‌షిప్ ఉండి, వార్షిక ప్లాన్‌కు మారాలనుకుంటే, ఎలా మారాలో ఇక్కడ తెలుసుకోండి.
  • కింది లొకేషన్‌లలో ఏదైనా ఒక లొకేషన్‌లో ఉండాలి:
    • యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, బ్రెజిల్, రష్యా, జర్మనీ, థాయిలాండ్, భారతదేశం, జపాన్.
    • భారతదేశ సబ్‌స్క్రయిబర్‌లకు గమనిక: మీరు 1 లేదా 3 నెలల ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, మీ ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే వార్షిక ప్లాన్‌కు మీరు సైన్ అప్ చేయవచ్చు.
గమనిక: వార్షిక ప్లాన్‌లు ఒక్కొక్క యూజర్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ ప్లాన్ యూజర్‌లకు మేము వార్షిక ప్లాన్‌లను అందించడం లేదు.

YouTube Premium వార్షిక ప్లాన్‌లు ఎలా పని చేస్తాయి?

మీరు వార్షిక ప్లాన్‌ను కొనుగోలు చేసినప్పుడు, రిపీట్ అవ్వని వ్యక్తిగత సబ్‌స్క్రిప్షన్ కోసం మీరు ముందస్తుగా పేమెంట్ చేస్తారు. మీరు పేమెంట్ చేసిన 12 నెలలకు సంబంధించిన వ్యవధి ముగిసిన తర్వాత మీ పెయిడ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలు ముగుస్తాయని దీని అర్థం. పేర్కొన్న సమయంలో, మీరు YouTube Music Premium లేదా YouTube Premiumకు గరిష్ఠంగా 2 సంవత్సరాల ప్రీపెయిడ్ యాక్సెస్‌ను కొనుగోలు చేయవచ్చు. మీ ప్రయోజనాలను యాక్సెస్ చేయడాన్ని కొనసాగించడానికి, మీ మెంబర్‌షిప్ గడువు ముగిసిన తర్వాత మీరు మరొక ప్లాన్‌ను కొనుగోలు చేయవలసి ఉంటుంది.

వార్షిక ప్లాన్‌లకు రీఫండ్‌లు పొందే అవకాశం ఉండదు, వార్షిక ప్లాన్‌లను పాజ్ చేయలేరు. మీ వార్షిక ప్లాన్ గురించి మీకు సందేహాలు ఉంటే, YouTube సపోర్ట్‌ను సంప్రదించండి. మీరు మోసపూరిత లావాదేవీని రిపోర్ట్ చేయాలనుకుంటే, ఇక్కడ క్లెయిమ్‌ను ఫైల్ చేయండి.

ఎలా సైన్ అప్ చేయాలి అనే దాని గురించి కింద మరింత తెలుసుకోండి. మీకు ఏది సరైనదో నిర్ణయించుకోవడానికి మీరు మా పెయిడ్ మెంబర్‌షిప్ ఆప్షన్‌లను కూడా అన్వేషించవచ్చు.

YouTube Premium వార్షిక ప్లాన్‌కు సైన్ అప్ చేయండి

YouTube Premium లేదా Music Premium వార్షిక ప్లాన్‌కు సైన్ అప్ చేసుకోవడానికి, కింది దశలను ఫాలో అవ్వండి.

YouTube Premium లేదా YouTube Music Premium వార్షిక ప్లాన్‌కు సైన్ అప్ చేయండి

  1. మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లో, YouTube లేదా YouTube Music యాప్‌ను తెరవండి.
  2. మీరు మీ మెంబర్‌షిప్‌ను ప్రారంభించాలనుకుంటున్న Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ ఫోటో  ఆ తర్వాత YouTube Premiumను పొందండి అనే ఆప్షన్‌ని ట్యాప్ చేయండి.
  4. ప్లాన్ ఆప్షన్‌లలో “వార్షికం” ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీ కొనుగోలును పూర్తి చేయండి.

మీ కొనుగోలును సురక్షితంగా పూర్తి చేయడానికి పిన్‌ని వెరిఫై చేయమని మిమ్మల్ని అడగవచ్చు. అడిగితే, స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అయ్యి వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయండి.

మీ కొనుగోలును పూర్తి చేసిన తర్వాత, మీ మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేయడానికి మీరు ఉపయోగించిన Google ఖాతాకు సైన్ ఇన్ చేయడం ద్వారా, కంప్యూటర్‌లో, Android లేదా Apple పరికరంలో మీ YouTube Premium లేదా YouTube Music Premium ప్రయోజనాలను ఉపయోగించుకోవచ్చు. మీ ఖాతాలోని పెయిడ్ మెంబర్‌షిప్‌ల విభాగానికి వెళ్లి, మీ ప్లాన్ గడువు ముగిసే తేదీని మీరు చెక్ చేసుకోవచ్చు.

మీ మెంబర్‌షిప్ రకాన్ని మార్చండి

మీకు కొనసాగుతున్న YouTube Premium లేదా Music Premium మెంబర్‌షిప్ ఉండి, మీరు వార్షిక ప్లాన్‌కు మారాలనుకుంటే, ముందుగా మీరు వార్షిక ప్లాన్‌లు అందుబాటులో ఉన్న ఈ లొకేషన్‌లలో ఒక దానిలో ఉన్నారని నిర్ధారించాలి:

  • యునైటెడ్ స్టేట్స్
  • కెనడా
  • మెక్సికో
  • బ్రెజిల్
  • రష్యా
  • జర్మనీ
  • థాయ్‌లాండ్
  • భారతదేశం
  • జపాన్

మీకు వార్షిక ప్లాన్‌ను పొందే అర్హత ఉంటే, మీరు మీ ప్రస్తుత మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసిన తర్వాత, మీరు YouTube Premium, లేదా Music Premium వార్షిక ప్లాన్‌కు సైన్ అప్ చేయవచ్చు. మీ ప్రస్తుత బిల్లింగ్ కాల వ్యవధి ముగిసిన తర్వాత మీ వార్షిక ప్లాన్ యాక్సెస్ ప్రారంభమవుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5165722011492989443
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false