YouTube Premium ట్రయల్స్, ఇంకా ప్రమోషన్‌ల గురించి తెలుసుకోండి

YouTube Premium ప్రత్యేక ఫీచర్‌లు, తెర వెనుక జరిగిన అనుభవాలు, మరిన్నింటితో మీ వీడియో, మ్యూజిక్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మీరు YouTube Premium లేదా YouTube Music Premiumను కొత్తగా ఉపయోగిస్తున్నట్లయితే, ట్రయల్ మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయడానికి మీకు అర్హత ఉండవచ్చు. దిగువున మరింత తెలుసుకోండి.

ట్రయల్స్ ఎలా పని చేస్తాయి

  • మీరు ట్రయల్‌కు సైన్ అప్ చేసినప్పుడు, YouTube Premium లేదా YouTube Music Premium మెంబర్ లాగానే అవే మెంబర్‌షిప్ ప్రయోజనాలను ఆస్వాదిస్తారు.
  • సైన్ అప్ చేస్తున్నప్పుడు, ఫైల్‌లో సేవ్ చేయడం కోసం మిమ్మల్ని పేమెంట్ ఆప్షన్ అడగడం జరుగుతుంది. మీరు మీ ఖాతాలో ప్రామాణీకరణ ఛార్జీ విధించబడటాన్ని గమనించవచ్చు, ఇది మీ పేమెంట్ ఆప్షన్ చెల్లుబాటు అయ్యేదా, కాదా అనే విషయాన్ని నిర్ధారించే వీలును మాకు కల్పిస్తుంది. ఈ ఛార్జీ ప్రాసెస్ చేయబడదు, 1-14 రోజులలోపు రీఫండ్ చేయబడుతుంది.
  • మీ ట్రయల్ ముగిసినప్పుడు, ఫైల్‌లోని పేమెంట్ ఆప్షన్‌తో మీ మెంబర్‌షిప్ ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ చేయబడుతుంది. ట్రయల్ ముగిసేలోపు మీరు రద్దు చేసుకుంటే మినహా, నెలవారీగా రిపీట్ అయ్యే పద్ధతిలో ప్రస్తుత మెంబర్‌షిప్ ధర మీ నుండి ఛార్జ్ చేయబడుతుంది.
  • ట్రయల్ సమయంలోనే మీరు మీ మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటే, మీ ట్రయల్ పీరియడ్ ముగిసినప్పుడు మీరు మీ Premium ప్రయోజనాలకు యాక్సెస్‌ను కోల్పోతారు.
గమనిక: మీరు కింది అర్హత ప్రమాణాలను పొందకపోతే, మీ ట్రయల్ రిక్వెస్ట్ ముందుకు సాగదు.

ట్రయల్‌కు కావలసిన అర్హత వివరాలు

గమనిక: ఒక్కో పేమెంట్ ఆప్షన్‌కు, మీరు ఒక ట్రయల్‌కు మాత్రమే సైన్ అప్ చేయగలరు: అవి, 1-నెల ట్రయల్స్ లేదా పొడిగించిన ట్రయల్స్.

Workspace ఖాతాలు ఉన్న యూజర్‌ల కోసం:

  • Workspace ఖాతా అనేది Workspace వ్యక్తిగత ఎడిషన్ ఖాతా అయితే తప్ప మీరు వ్యక్తిగత లేదా ఫ్యామిలీ మెంబర్‌షిప్‌ను ఉపయోగించి YouTube Premiumకు సైన్ అప్ చేయలేరు.
  • మీరు ఏ Workspace ఖాతాతోనైనా YouTube Premium విద్యార్థి మెంబర్‌షిప్‌నకు సైన్ అప్ చేయవచ్చు.
  • మీకు ట్రయల్‌కు అర్హత ఉందని భావిస్తున్నారు, కానీ మీకు ట్రయల్ ఆప్షన్ కనిపించకపోతే, మీ వ్యక్తిగత ఖాతాకు మారి, youtube.com/premium లింక్‌లో సైన్ అప్ చేయండి.

YouTube Premium & Music Premium 1 నెల ట్రయల్స్:

  • కింది యూజర్‌లకు 1-నెల ట్రయల్స్ అందుబాటులో ఉన్నాయి:
    • మొదటిసారి ఉపయోగించే మెంబర్‌లు
    • కనీసం గత 6 నెలల్లో YouTube Premium, Music Premium, లేదా Google Play మెంబర్‌షిప్‌ను రద్దు చేసిన యూజర్‌లు
  • ప్రతి 12-నెలల వ్యవధికీ 1 ట్రయల్ మాత్రమే అనుమతించబడుతుంది

YouTube Premium & Music Premium పొడిగించిన ట్రయల్స్: కొన్నిసార్లు, మేము 1 నెల కంటే ఎక్కువ కాలంపాటు సాగే పొడిగించిన ట్రయల్‌ను అందిస్తాము.

  • పొడిగించిన ట్రయల్స్ మొదటిసారి ఉపయోగించే యూజర్‌లకు అందుబాటులో ఉంటాయి; లేదా మీ మునుపటి మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకున్న 3 సంవత్సరాల తర్వాత అందుబాటులోకి వస్తాయి.
  • 3 సంవత్సరాల వ్యవధికి గాను 1 పొడిగించిన ట్రయల్ మాత్రమే అనుమతించబడుతుంది.
గమనిక: మీరు అర్హత ప్రమాణాలను పొందకపోతే, మీ ట్రయల్ రిక్వెస్ట్ ముందుకు సాగదు.

మీ ట్రయల్ అర్హతను చెక్ చేయండి

మీకు ట్రయల్ కోసం అర్హత ఉందో లేదో కంప్యూటర్‌లో చూడటానికి:

  1. మీ YouTube ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. youtube.com/paid_memberships లింక్‌కు వెళ్లండి.
  3. YouTube అందించే ఆఫర్‌ల కింద, అర్హత ఉన్న ట్రయల్స్‌ను మేము లిస్ట్ చేస్తాము.
  4. ఆఫర్‌లలో ఒక దానిని ఎంచుకొని, రిడీమ్ చేసుకోవడానికి దశలను ఫాలో అవ్వండి.
గమనిక: మీరు అర్హత ప్రమాణాలను పొందకపోతే, మీ ట్రయల్ రిక్వెస్ట్ ముందుకు సాగదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13125584025084136052
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false