మీ యాక్టివిటీని తొలగించండి

మీరు Google సైట్‌లు, యాప్‌లు, సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు, మీ యాక్టివిటీలో కొంత భాగం మీ Google ఖాతాలో సేవ్ అవుతుంది. 'నా యాక్టివిటీ'లో మీరు ఈ యాక్టివిటీని కనుగొనవచ్చు, తొలగించవచ్చు, అలాగే మీరు ఏ సమయంలో అయినా చాలా వరకు యాక్టివిటీని సేవ్ చేయడం ఆపివేయవచ్చు.

మొత్తం యాక్టివిటీని తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, myactivity.google.com కు వెళ్లండి.
  2. మీ యాక్టివిటీకి ఎగువున, తొలగించండి ను క్లిక్ చేయండి.
  3. మొత్తం యాక్టివిటీని క్లిక్ చేయండి.
  4. తర్వాత ఆ తర్వాత తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఒక్కో యాక్టివిటీ ఐటెమ్‌ను తొలగించండి

ఉదాహరణకు, ఇందులో మీరు Googleలో చేసిన ఒక సెర్చ్ లేదా Chromeలో సందర్శించిన ఒక వెబ్‌సైట్ ఉండవచ్చు:
  1. మీ కంప్యూటర్‌లో, myactivity.google.comకు వెళ్లండి.
  2. మీ యాక్టివిటీకి స్క్రోల్ చేయండి.
  3. మీరు తొలగించాలనుకుంటున్న ఐటెమ్‌ను కనుగొనండి. ఐటెమ్‌ను కనుగొనడానికి కొన్ని వేర్వేరు మార్గాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇక్కడ పేర్కొనబడ్డాయి:
    • రోజు ఆధారంగా బ్రౌజ్ చేయండి.
    • సెర్చ్ చేయండి లేదా ఫిల్టర్‌లను ఉపయోగించండి.
  4. మీరు తొలగించాలనుకుంటున్న ఐటెమ్‌పై, తొలగించండి ను క్లిక్ చేయండి.

తేదీ లేదా ప్రోడక్ట్ ఆధారంగా యాక్టివిటీని తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, myactivity.google.comకు వెళ్లండి.
  2. మీ యాక్టివిటీకి స్క్రోల్ చేయండి.
  3. మీ యాక్టివిటీని ఫిల్టర్ చేయండి. మీరు ఒకే సమయంలో తేదీ, అలాగే ప్రోడక్ట్ రెండింటి ఆధారంగా ఫిల్టర్ చేయవచ్చు.
    • తేదీ ఆధారంగా ఫిల్టర్ చేయడానికి: Calendar eventను ఎంచుకోండి. ఆపై, ఏదైనా ఒక తేదీకి ముందున్న యాక్టివిటీని కనుగొనడానికి ఆ తేదీని ఎంచుకోండి.
    • ప్రోడక్ట్ ఆధారంగా ఫిల్టర్ చేయడానికి: Search Searchను ఎంచుకోండి. ఆపై, మీరు చేర్చాలనుకుంటున్న ప్రోడక్ట్‌లను ఎంచుకోండి. కొన్ని Google ప్రోడక్ట్‌లు, యాక్టివిటీని 'నా యాక్టివిటీ'లో సేవ్ చేయవు.
  4. యాక్టివిటీని తొలగించండి.
    • మీరు ఫిల్టర్ చేసిన యాక్టివిటీని తొలగించడానికి: సెర్చ్ బార్ పక్కన, తొలగించండి and thenఫలితాలను తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • నిర్దిష్ట ఐటెమ్‌లను తొలగించడానికి: మీరు తొలగించాలనుకుంటున్న ఐటెమ్‌పై, తొలగించండి ను ఎంచుకోండి.

మీ యాక్టివిటీని ఆటోమేటిక్‌గా తొలగించండి

మీ Google ఖాతాలోని కొంత యాక్టివిటీని మీరు ఆటోమేటిక్‌గా తొలగించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు" ఆప్షన్ కింద, మీరు ఆటోమేటిక్‌గా తొలగించాలనుకుంటున్న యాక్టివిటీ లేదా హిస్టరీ సెట్టింగ్‌పై క్లిక్ చేయండి.
  4. ఆటోమేటిక్ తొలగింపు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. మీ యాక్టివిటీని మీరు ఎంత కాలం పాటు ఉంచాలనుకుంటున్నారనే బటన్‌ను క్లిక్ చేసి ఆ తర్వాత తర్వాత ఆ తర్వాత నిర్ధారించండి ఆప్షన్‌ను క్లిక్ చేయడం ద్వారా మీ ఎంపికను సేవ్ చేయండి.

చిట్కా: కొంత యాక్టివిటీ మీరు ఎంచుకున్న సమయ పరిధి కంటే ముందుగానే తొలగించబడవచ్చు. ఉదాహరణకు, మీ పరికరం యొక్క జనరల్ ఏరియా, IP అడ్రస్‌కు సంబంధించిన లొకేషన్ సమాచారం అనేది 30 రోజుల తర్వాత మీ వెబ్ & యాప్ యాక్టివిటీ నుండి ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది.

ఇతర ప్రదేశాలలోని యాక్టివిటీని తొలగించండి

నా యాక్టివిటీలోనే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా మీ యాక్టివిటీ సేవ్ కావచ్చు. ఉదాహరణకు, మీరు లొకేషన్ హిస్టరీని ఆన్ చేసి ఉంటే, ఆ యాక్టివిటీ మీ Maps టైమ్‌లైన్‌లో సేవ్ అవుతుంది కానీ 'నా యాక్టివిటీ'లో సేవ్ అవ్వదు. ఆ ప్రదేశాలలో సేవ్ అయిన మీ యాక్టివిటీలో చాలా వరకు యాక్టివిటీని మీరు తొలగించవచ్చు.

మీ ఖాతాలో సేవ్ చేయబడిన ఇతర యాక్టివిటీను తొలగించండి

  1. మీ కంప్యూటర్‌లో, myactivity.google.com కు వెళ్లండి.
  2. మీ యాక్టివిటీకి ఎగువున, సెర్చ్ బార్‌లో, మరిన్ని More ఆ తర్వాత ఇతర Google యాక్టివిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. ఇక్కడి నుండి, మీరు వీటిని చేయవచ్చు:
    • నిర్దిష్ట యాక్టివిటీని తొలగించడం. యాక్టివిటీ కింద, తొలగించండి ఆ తర్వాత తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • యాక్టివిటీని ఎక్కడ తొలగించాలో కనుగొనడం: యాక్టివిటీ కింద సందర్శించండి, చూడండి, లేదా మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

బ్రౌజర్ యాక్టివిటీని తొలగించండి

మీ యాక్టివిటీని మీరు 'నా యాక్టివిటీ' నుండి తొలగించినప్పటికీ, అది మీ బ్రౌజర్‌లో స్టోర్ అయ్యి ఉండవచ్చు.

యాక్టివిటీని ఆఫ్ చేయండి & తొలగించండి

'నా యాక్టివిటీ'లోని చాలా వరకు సమాచారాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు.

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న, డేటా & గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "హిస్టరీ సెట్టింగ్‌లు" ఆప్షన్ కింద, మీరు సేవ్ చేయకూడదనుకునే యాక్టివిటీ లేదా హిస్టరీ సెట్టింగ్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు సేవ్ చేయకూడదనుకునే సెట్టింగ్ కింద, ఆఫ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. సెట్టింగ్‌ను ఆఫ్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి, లేదా ఆఫ్ చేయండి లేదా యాక్టివిటీని ఆఫ్ చేసి, తొలగించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
    • యాక్టివిటీని ఆఫ్ చేసి, తొలగించండి ఆప్షన్‌ను మీరు ఎంచుకుంటే, ఏ యాక్టివిటీని తొలగించాలనుకుంటున్నారో ఎంచుకోవడానికి అలాగే నిర్ధారించడానికి దశలను ఫాలో అవ్వండి.

చిట్కా: కొంత యాక్టివిటీ నా యాక్టివిటీలో చేర్చబడి ఉండదు.

యాక్టివిటీను సేవ్ చేయడం తాత్కాలికంగా ఆపివేయండి

మీరు వెబ్‌ను ప్రైవేట్‌గా సెర్చ్ చేయవచ్చు, బ్రౌజ్ చేయవచ్చు.

చిట్కా: మీరు మీ Google ఖాతాకు ప్రైవేట్ బ్రౌజింగ్ విండోలో సైన్ ఇన్ చేసినట్లయితే, మీ సెర్చ్ యాక్టివిటీ ఆ ఖాతాలో స్టోర్ చేయబడవచ్చు.

సమస్యలను పరిష్కరించండి

తొలగించబడిన యాక్టివిటీ, 'నా యాక్టివిటీ'లో కనబడుతోంది

  • పరికరం, ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి. మీరు 'నా యాక్టివిటీ' నుండి ఐటెమ్‌లను ఒక పరికరంలో తొలగిస్తే, అవి ఆఫ్‌లైన్‌లో ఉండే పరికరాలలో ఇప్పటికీ కనిపించవచ్చు. పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయినప్పుడు, ఆ ఐటెమ్‌లు తీసివేయబడతాయి.
  • మీ కాష్, అలాగే కుక్కీలను క్లియర్ చేయండి.

మీ యాక్టివిటీ ఎలా తొలగించబడుతుంది

మీరు యాక్టివిటీని మాన్యువల్‌గా తొలగించాలని ఎంచుకున్నప్పుడు లేదా మీ ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్ ఆధారంగా ఆటోమేటిక్‌గా యాక్టీవిటీ తొలగించబడినప్పుడు, మేము వెంటనే ప్రోడక్ట్ నుండి, అలాగే మా సిస్టమ్‌ల నుండి దాన్ని తీసివేసే ప్రాసెస్‌ను ప్రారంభిస్తాము.

ముందుగా, మేము దాన్ని వెంటనే వీక్షణ నుండి తీసివేయడానికి ప్రయత్నిస్తాము, ఇకపై ఆ డేటా మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఉపయోగించబడకపోవచ్చు.

ఆ తర్వాత, మా స్టోరేజ్ సిస్టమ్‌ల నుండి డేటాను సురక్షితంగా, పూర్తిగా తొలగించడానికి రూపొందించబడిన ఒక ప్రాసెస్‌ను మేము ప్రారంభిస్తాము. 

డేటాను మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్‌గా తొలగించడంలో మీకు సహాయపడటంతో పాటు, ఇకపై మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడని కొన్ని రకాల యాక్టివిటీని Google త్వరగా తొలగించే అవకాశం ఉంది. 

బిజినెస్ లేదా చట్టపరమైన అవసరాలు వంటి పరిమిత ప్రయోజనాల కోసం, మరింత ఎక్కువ కాలం పాటు Google  కొన్ని రకాల డేటాను స్టోర్ చేయవచ్చు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6150162976818580338
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false