మీ Google స్టోరేజ్ పని చేసే విధానం

ప్రతి Google ఖాతా 15 GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది, ఇది Gmail, Google Drive, అలాగే Google Photos అంతటా షేర్ చేయబడుతుంది. మీ స్టోరేజ్ కోటాకు జోడించడానికి, అందుబాటులో ఉన్న చోట మీరు Google One మెంబర్‌షిప్‌ను కొనుగోలు చేయవచ్చు. అప్పుడప్పుడు, మీరు ప్రత్యేక ప్రమోషన్ లేదా సంబంధిత కొనుగోలు నుండి మరింత స్టోరేజ్‌ను పొందగలరు. స్పేస్‌ను ఎలా క్లీన్ చేయాలి లేదా దాన్ని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి అలాగే మీరు మీ స్టోరేజ్‌ను ఎలా ఉపయోగించాలి అనేదాని గురించి తెలుసుకోండి.

మీ Google ఖాతా స్టోరేజ్‌ను ప్రభావితం చేసేవి ఏమిటి

మీ స్టోరేజ్ కోటాలో భాగంగా ఏమి లెక్కించబడుతుంది

  • ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలు Google Photosకు బ్యాకప్ చేయబడ్డాయి.
  • హై క్వాలిటీ (ఇప్పుడు స్టోరేజ్ సేవర్ పేరుతో ఉంది), తక్కువ క్వాలిటీ ఫోటోలు, వీడియోలు జూన్ 1, 2021 తర్వాత Google Photosకు బ్యాకప్ చేయబడతాయి. జూన్ 1, 2021 తేదీకి ముందు మీరు బ్యాకప్ చేసిన హై క్వాలిటీ లేదా తక్కువ క్వాలిటీ ఉన్న ఏవైనా ఫోటోలు లేదా వీడియోలు Google ఖాతా స్టోరేజ్‌లో భాగంగా లెక్కించబడవు. ఈ మార్పు గురించి మరింత తెలుసుకోండి.
  • మీ స్పామ్, ట్రాష్ ఫోల్డర్‌లతో పాటు, Gmail మెసేజ్‌లు, అటాచ్‌మెంట్‌లు.
  • Google Driveలోని PDFలు, ఇమేజ్‌లు, వీడియోలతో సహా అన్ని ఫైల్స్.
  • Meet కాల్ రికార్డింగ్‌లు.
  • Google Docs, Sheets, Slides, Drawings, Forms, Recorder, అలాగే Jamboard వంటి సహకారంతో కూడిన కంటెంట్ క్రియేషన్ యాప్‌లలో క్రియేట్ లేదా ఎడిట్ చేసిన ఫైల్స్.
    • జూన్ 1, 2021 తర్వాత క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన ఫైల్స్ మీ కోటాలో భాగంగా లెక్కించబడతాయి.
    • జూన్ 1, 2021 కన్నా ముందు అప్‌లోడ్ చేసిన లేదా చివరిగా ఎడిట్ చేసిన ఫైల్స్ మీ కోటాలో భాగంగా లెక్కించబడవు.

చిట్కా: WhatsApp నుండి Androidలోకి బ్యాకప్ అయ్యే డేటా, త్వరలోనే మీ Google ఖాతా స్టోరేజ్‌లో భాగంగా లెక్కించబడుతుంది. WhatsApp బ్యాకప్ గురించి మరింత తెలుసుకోండి.

మీరు కోటా దాటిపోయారు అంటే, మీకు అందుబాటులో ఉన్న దాని కంటే మరింత ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ని ఉపయోగిస్తున్నారని అర్థం. మీరు మీ స్టోరేజ్ కోటాను మించిపోతే:

  • మీరు Google Driveకు కొత్త ఫైల్స్‌ను లేదా ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయలేరు.
  • మీరు Google Photosకు ఫోటోలను, వీడియోలను వేటినీ బ్యాకప్ చేయలేరు.
  • Gmailలో ఈమెయిల్‌ను పంపగల లేదా అందుకోగల మీ సామర్థ్యం ప్రభావితం కావచ్చు.
  • Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard లాంటి సహకార కంటెంట్ క్రియేషన్ యాప్‌లలో మీరు కొత్త ఫైల్స్‌ను క్రియేట్ చేయలేరు. మీ స్టోరేజ్ వినియోగాన్ని మీరు తగ్గించుకునే దాకా, ఇంకెవ్వరూ ప్రభావితమైన మీ ఫైల్స్‌ను ఎడిట్ లేదా కాపీ చేయలేరు.
  • కొత్త రికార్డర్ ఫైల్స్‌ను మీరు బ్యాకప్ చేయలేరు.
  • గమనిక: మీరు ఇప్పటికీ మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి, యాక్సెస్ చేయవచ్చు.

మీరు 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం మీ కోటాను మించిపోయి ఉంటే: కోటా పరిధిలోకి తిరిగి రావడానికి మీరు స్పేస్‌ను ఖాళీ చేయడం గానీ లేదా కొనడం గానీ చేయకపోతే, Gmail, Google Photos, Google Drive (Google Docs, Sheets, Slides, Drawings, Forms, Jamboard ఫైల్స్‌తో సహా) నుండి మీ కంటెంట్ మొత్తం తీసివేయబడవచ్చు.

మీ కంటెంట్‌ను తీసివేయడానికి ముందుగా, మేము వీటిని చేస్తాము:

  • Google ప్రోడక్ట్‌లలోని ఈమెయిల్, ఇంకా నోటిఫికేషన్‌ల ద్వారా మీకు నోటీస్ ఇస్తాము. కంటెంట్, తొలగింపునకు అర్హత పొందే తేదీకి కనీసం మూడు నెలల ముందు మేము మిమ్మల్ని సంప్రదిస్తాము. 
  • తొలగింపును నివారించడానికి మీకు అవకాశం ఇస్తాము (అదనపు స్టోరేజ్ కోసం పేమెంట్ చేయడం ద్వారా లేదా ఫైల్‌లను తీసివేయడం ద్వారా)
  • మా సర్వీస్‌ల నుండి మీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాము. మీ Google డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

తిరిగి కోటా పరిధిలోకి ఎలా చేరుకోవాలి

స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయడానికి వివిధ రకాల మార్గాలను గుర్తించడంలో మీకు సహాయపడే స్టోరేజ్ మేనేజ్‌మెంట్ టూల్స్‌కు మేము యాక్సెస్‌ను ఇస్తాము. స్పేస్‌ను ఖాళీ చేయడానికి మరొక ఆప్షన్ ఏంటంటే, మీ ఫైల్స్‌ను మీ వ్యక్తిగత పరికరంలోకి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ తర్వాత వాటిని మీ క్లౌడ్ స్టోరేజ్ నుండి తొలగించడం.

Gmail, Drive, Photos కోసం మీకు మరింత స్టోరేజ్ స్పేస్ కావాలనుకుంటే, మీరు Google Oneతో మరింత పెద్ద స్టోరేజ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 

తరచుగా అడిగే ప్రశ్నలు

G Suite/Workspace ఖాతాలకు, అలాగే కన్జ్యూమర్ ఖాతాలకు కూడా ఈ పాలసీలు వర్తిస్తాయా?
కోటాకు సంబంధించిన కొన్ని మార్పులు, కొన్ని Google Workspace, G Suite for Education, అలాగే G Suite for Nonprofits ప్లాన్‌లకు వర్తిస్తాయి. వాటిని ఈ మార్పులు ఎలా ప్రభావితం చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి, దయచేసి మా Google Workspace అప్‌డేట్‌లు చూడండి. 
ఈ పాలసీలు, Google Sites, Google Keep ఇంకా ఇక్కడ లిస్ట్ చేయని ఇతర క్రియేషన్ యాప్‌లకు వర్తిస్తాయా? Blogger & YouTube కంటెంట్ సంగతి ఏంటి?

కోటాకు మించిన వినియోగానికి సంబంధించిన పాలసీ వీటికి వర్తించదు:

  • Google Sites
  • Google Keep
  • Blogger
  • YouTube

ఇన్‌యాక్టివ్ పాలసీ, మీ Google ఖాతాలోని మొత్తం కంటెంట్‌కు ఇంకా ఖాతాకు కూడా వర్తిస్తుంది.

నేను నా కోటాను మించిపోయాను. నా కంటెంట్ ఎప్పటిలోపు తొలగించబడుతుంది? 
ఒకవేళ మీ ఖాతా ఈ పాలసీ మార్పునకు లోబడి ఉన్నట్లయితే, మీ కంటెంట్ తొలగించబడటానికి ముందు, మేము మీకు ముందుగానే (కనీసం మూడు నెలల ముందు) నోటీస్‌ను అందజేయడానికి ప్రయత్నిస్తాము. 2 సంవత్సరాల పాటు మీ స్టోరేజ్ కోటాను మీరు మించిపోయి ఉన్నప్పుడు, మీ కంటెంట్, తొలగింపునకు అర్హత పొందుతుంది. మీ కంటెంట్ తొలగించబడకుండా చూసుకోవడానికి, మీరు ఉపయోగిస్తున్న స్టోరేజ్ మొత్తాన్ని తగ్గించుకోండి లేదా Google Oneతో పెద్ద స్టోరేజ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి.
నా డేటాను తొలగించే ముందు మీరు నాకు సమాచారం ఏమైనా ఇస్తారా? 

మీ ఖాతా ఈ పాలసీ మార్పునకు లోబడి ఉన్నట్లయితే, మీ కంటెంట్‌ను తొలగించడానికి కనీసం 3 నెలల ముందు మీకు ఆ విషయాన్ని నోటీసు ద్వారా తెలియజేస్తాం.

ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు వారి నుండి కంటెంట్‌ను నేను ఎలా భద్రపరచాలి?

అనేక మంది వ్యక్తులు తమ ఆన్‌లైన్ ఖాతాలను ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి స్పష్టమైన సూచనలను ఇవ్వకుండానే మరణిస్తున్న విషయాన్ని మేము గుర్తించాము. మరణించిన యూజర్ ఖాతా నుండి కంటెంట్‌ను అందించడానికి సమీప ఫ్యామిలీ మెంబర్‌లు అలాగే ప్రతినిధులతో (నిర్దిష్ట సందర్భాలలో) Google పని చేయవచ్చు. మరణించిన యూజర్‌కు చెందిన డేటాను రిక్వెస్ట్ చేయడానికి సంబంధించిన మా ప్రాసెస్ గురించి మరింత తెలుసుకోండి.

మరణం సంభవించినప్పుడు లేదా చాలా కాలం పాటు యాక్టివిటీ లేనప్పుడు మీ డేటా విషయంలో ఏమి చేయాలో మాకు ముందుగానే తెలియజేయడానికి, Inactive Account Manager గురించి మరింత తెలుసుకోండి.

చిట్కా: మా ఇన్‌యాక్టివ్ పాలసీలను, కోటాకు మించి వినియోగానికి సంబంధించిన పాలసీలను Inactive Account Manager సెట్టింగ్‌లు ఓవర్‌రైడ్ చేయవు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14754898977974189140
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false