స్క్రీన్ రీడర్ సహాయంతో Google డిస్క్‌లో నావిగేట్ చేయండి

మీ స్క్రీన్ రీడర్‌తో నావిగేట్ చేయడానికి డ్రైవ్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లోని ఈ ప్రాంతాలను ఉపయోగించండి.

నావిగేషన్ ప్యానెల్: Google డిస్క్ వీక్షణను లేదా మీ ఫోల్డర్‌లలో ఒక దానిని తెరవండి. Google డిస్క్ వీక్షణలలో నా డిస్క్, నాతో షేర్ చేసినవి, Google ఫోటోలు, ఇటీవిలివి, నక్షత్రం ఉన్నవి, ట్రాష్ ఎంపికలు ఉంటాయి. 

  • నావిగేషన్ ప్యానెల్‌కు వెళ్లడానికి, 'g' నొక్కి, ఆపై 'n' నొక్కండి.
  • నావిగేషన్ ప్యానెల్‌లో జరపడానికి, కిందికి లేదా పైకి బాణాలను నొక్కండి.
  • ఉప-ఫోల్డర్‌ను తెరవడానికి, కుడి వైపు బాణం నొక్కండి.
  • ఫోల్డర్ లేదా వీక్షణను ఎంచుకోవడానికి, 'Enter' నొక్కండి

ప్రధాన కంటెంట్ ఏరియా: లిస్ట్ లేదా గ్రిడ్ ఫార్మాట్‌లో మీ ఫైళ్లను, ఫోల్డర్‌లను బ్రౌజ్ చేయండి. Drive ఆటోమేటిక్‌గా లిస్ట్ లేఅవుట్‌ను చూపుతుంది.

  • ప్రధాన ప్రదేశానికి వెళ్లడానికి, g, ఆపై l నొక్కండి.
  • జాబితా లేదా గ్రిడ్‌లో నావిగేట్ చేయడానికి, బాణం కీలను ఉపయోగించండి.
  • అంశాన్ని తెరవడానికి, o లేదా Enter నొక్కండి.
  • గ్రిడ్, జాబితా వీక్షణల మధ్య మార్చడానికి, 'v' అక్షరాన్ని నొక్కండి.

వివరాలు: ఫైల్ లేదా ఫోల్డర్ గురించిన సమాచారం, ఉదా., యజమాని, సైజ్, ఎప్పుడు చివరిగా సవరించబడింది లాంటివి కనుగొనండి.

  • వివరాల పేన్‌కు వెళ్లడానికి, g అక్షరాన్ని నొక్కి, ఆపై d నొక్కండి.
  • వివరాల పేన్‌లో రెండు ట్యాబ్‌లు ఉంటాయి: వివరాలు, కార్యకలాపం.
  • వివరాలు లేదా కార్యకలాపం ట్యాబ్‌ను సమీక్షించడానికి, వర్చువల్ కర్సర్ లేదా బ్రౌజ్ మోడ్‌ను ఆన్ చేయండి.

Google బార్: 'Google బార్' అన్నది ఇంటర్‌ఫేస్‌లోని అత్యంత పైభాగంలో, Google డిస్క్ బటన్‌లు, మెనూల ఎగువున ఉంటుంది. ఈ ప్రదేశంలో యాప్‌ల పాప్-అప్ మెనూ, దానితో పాటు ఇతర Google యాప్‌లకు లింక్‌లు, Google నోటిఫికేషన్‌ల బటన్, ఇంకా ఇతర ఎంపికలు ఉంటాయి.

కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

డ్రైవ్‌లో త్వరగా జరపడానికి, మీరు డ్రైవ్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు.

డ్రైవ్‌లో షార్ట్‌కట్‌ల జాబితాను తెరవడానికి, Windows లేదా Chrome OSలో Ctrl + / (ముందుకు స్లాష్)ను లేదా Macలో ⌘ + / (ముందుకు స్లాష్)ను నొక్కండి.

ఫైల్‌ల కోసం వెతకండి

డ్రైవ్‌లో వెతకడానికి:

  1. శోధన పెట్టెకు వెళ్లడానికి, / (ముందుకు స్లాష్) గుర్తును నొక్కండి.
  2. మీ శోధన పదాలను టైప్ చేసి, ఆపై Enter నొక్కండి. మీ శోధన పదాలతో సరిపోలే ఫైల్‌లు, ఫోల్డర్‌ల జాబితా చూపబడుతుంది.
  3. శోధన ఫలితాలను బ్రౌజ్ చేయడానికి, బాణం కీలను ఉపయోగించండి.

అధునాతన శోధనను నిర్వహించడానికి:

  1. శోధన పెట్టెకు వెళ్లడానికి, / (ముందుకు స్లాష్) గుర్తును నొక్కండి.
  2. శోధన ఎంపికల మెనుకు తరలించడానికి, 'Tab' నొక్కి, ఆపై 'Enter' నొక్కండి.
  3. మీ శోధనను శుద్ధి చేయడానికి శోధన ఎంపికలలో మెనులు, వచన ఫీల్డ్‌లను ఉపయోగించండి.
  4. శోధన బటన్‌కు నావిగేట్ చేసి, ఆపై Enter నొక్కండి. మీ శోధన పదాలతో సరిపోలే ఫైల్‌లు, ఫోల్డర్‌ల జాబితా చూపబడుతుంది.
  5. శోధన ఫలితాలను బ్రౌజ్ చేయడానికి, బాణం కీలను ఉపయోగించండి.

డ్రైవ్‌లో శోధన పెట్టెను ఉపయోగించడం గురించి మరింత సమాచారం, చిట్కాల కోసం, 'మీ ఫైల్‌ల కోసం వెతకండి' లింక్‌ను చూడండి. తొలగించిన ఫైల్‌ను పునరుద్ధరించడానికి లేదా కనుగొనడానికి, ఫైల్‌ను ఎలా కనుగొనాలి లేదా తిరిగి పొందాలో తెలుసుకోండి.

ఫైల్‌లను క్రమీకరించండి

మీ ఫైల్‌లను క్రమీకరించడానికి:

  1. క్రమీకరణ మెనూను తెరవడానికి 'r' అక్షరాన్ని నొక్కండి.
  2. మెనూలో జరపడానికి, కిందికి లేదా పై వైపు బాణాలను ఉపయోగించండి. మీరు "పేరు", "ఎడిట్ చేసినవి" వంటి క్రమబద్ధీకరణ ఆప్షన్‌ల ద్వారా నావిగేట్ చేస్తున్నప్పుడు "చెక్ చేయబడింది" లేదా "చెక్ చేయబడలేదు" కోసం వినండి.
  3. క్రమబద్ధీకరణ ఆప్షన్‌లను ఎంచుకోవడానికి, Enterను నొక్కండి. మీ ఫోకస్ ఫైళ్లు, ఫోల్డర్‌ల లిస్ట్‌కు తిరిగి వస్తుంది.

సహాయం, అభిప్రాయం

సహాయ పత్రాలను చదవడానికి లేదా అభిప్రాయాన్ని పంపడానికి:

  1. Google డిస్క్ సెట్టింగ్‌ల మెనుని తెరవడానికి t అక్షరాన్ని నొక్కండి.
  2. మెనూలో సహాయం ఎంపికకు నావిగేట్ చేయండి.
  3. సహాయ కథనాల కోసం వెతకండి, లేదా మీ అభిప్రాయాన్ని Googleకు పంపడానికి అభిప్రాయాన్ని పంపు ఉపయోగించండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1679638993319903595
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false