ఆఫ్‌లైన్‌లో మీ Chromebookను ఉపయోగించండి

మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోయినప్పటికీ, మీ Chromebookతో మీరు చాలా పనులు చేయవచ్చు.

ముఖ్య గమనికలు:

  • కొన్ని ఆఫ్‌లైన్ యాప్‌లు, సర్వీస్‌లు అజ్ఞాత లేదా గెస్ట్ మోడ్‌లో పని చేయవు.
  • మీరు Gmailను మీ వర్క్ లేదా స్కూల్ ఖాతాతో ఉపయోగిస్తుంటే, మీ Gmail ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లను మార్చడంలో సహాయం చేయమని మీరు మీ అడ్మిన్‌ను అడగవచ్చు.

మీ ఈమెయిల్‌ను చెక్ చేయండి

మీరు mail.google.com కు వెళ్లడం ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పటికీ మీ Gmail మెసేజ్‌లను చదవవచ్చు, వాటికి ప్రతిస్పందించవచ్చు, అలాగే వాటి కోసం సెర్చ్ చేయవచ్చు. దాన్ని సెటప్ చేయడానికి:

  1. Chrome Chromeను తెరవండి. ముఖ్య గమనిక: Gmail ఆఫ్‌లైన్ అజ్ఞాత మోడ్‌లో పని చేయదు.
  2. Gmail ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లుకు వెళ్ళండి.
  3. "ఆఫ్‌లైన్ మెయిల్‌ను ఎనేబుల్ చేయి"ని ఎంచుకోండి.
  4. ఎన్ని రోజుల మెసేజ్‌లను సింక్ చేయాలనుకుంటున్నారు లాంటి మీ సెట్టింగ్‌లను ఎంచుకోండి.
  5. మార్పులను సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పుడు Gmailను ఉపయోగించడానికి, mail.google.com కు వెళ్లండి.

గమనిక: మీరు ఆఫ్‌లైన్‌లో ఈమెయిల్స్ పంపినప్పుడు, మీ ఈమెయిల్ కొత్త "అవుట్‌బాక్స్" ఫోల్డర్‌కు వెళ్తుంది, మీరు తిరిగి ఆన్‌లైన్‌కు వచ్చిన వెంటనే అది పంపబడుతుంది. Gmail ఆఫ్‌లైన్‌ను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.

సినిమాలు, మ్యూజిక్‌ను ప్లే చేయండి, లేదా గేమ్‌లను ఆడండి

సినిమాలను, టీవీ షోలను ఆఫ్‌లైన్‌లో చూడండి

ముందుగా, Google Play Moviesలో సినిమాను లేదా టీవీ షోను కొనుగోలు చేయండి.

షోను డౌన్‌లోడ్ చేయండి

తర్వాత, మీ సినిమాను లేదా టీవీ షోను మీ Chromebookకు డౌన్‌లోడ్ చేసుకోండి:

  1. మీ స్క్రీన్ మూలన, లాంచర్ ను ఎంచుకోండి.
  2. Google Play Movies యాప్ Play Moviesను ఎంచుకోండి.
  3. నా సినిమాలు లేదా నా టీవీ షోలు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న సినిమా లేదా టీవీ ఎపిసోడ్ పక్కన, డౌన్‌లోడ్ చేయండి Downloadని ఎంచుకోండి.

మీ డౌన్‌లోడ్ ప్రోగ్రెస్‌ను చూపడానికి డౌన్‌లోడ్ చిహ్నం ఎరుపు రంగులో నింపబడుతుంది. డౌన్‌లోడ్ చిహ్నం ఎంపిక గుర్తుగా మారిన తర్వాత మీరు మీ వీడియోను ఆఫ్‌లైన్‌లో చూడవచ్చు.

డౌన్‌లోడ్ చేయడం పని చేయకపోతే, వీడియోలను డౌన్‌లోడ్ చేయడంలో సమస్యలను పరిష్కరించడం ఎలాగో తెలుసుకోండి.

ఆఫ్‌లైన్‌లో చూడండి

మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పుడు సినిమాను లేదా టీవీ షోను చూడటానికి, Google Play Movies యాప్ Play Moviesను తెరవండి.

వీడియోను తీసివేయడానికి, డౌన్‌లోడ్ చేయబడినవి Downloadedని ఎంచుకోండి.

ఆఫ్‌లైన్‌లో మ్యూజిక్ వినండి
Chromebook కోసం YouTube Music అనేది ఆఫ్‌లైన్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేయదు. ఆఫ్‌లైన్‌లో మ్యూజిక్ వినడానికి, మీకు కింద పేర్కొన్నవి అవసరం:
ఆఫ్‌లైన్‌లో గేమ్‌లు ఆడండి

ముందుగా, ఆఫ్‌లైన్‌లో ఆడగల గేమ్‌లను కనుగొని, ఇన్‌స్టాల్ చేయండి:

  1. Chrome వెబ్ స్టోర్‌కు వెళ్లండి.
  2. ఎడమ వైపున, గేమ్‌లు అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఆఫ్‌లైన్‌లో రన్ అయ్యేవి అనే బాక్స్‌ను ఎంచుకోండి.

Cut the Rope, Cube Slam వంటి చాలా గేమ్‌లు ఆఫ్‌లైన్‌లో పని చేస్తాయి. మీ Chromebook, Android యాప్‌లతో పని చేస్తుంటే, మీరు ఆఫ్‌లైన్ గేమ్‌ల కోసం Google Play Store యాప్‌లో కూడా సెర్చ్ చేయవచ్చు.

మీరు ఇన్‌స్టాల్ చేసిన గేమ్‌ను కనుగొనడానికి: 

  1. మీ స్క్రీన్ మూలన, లాంచర్ ను ఎంచుకోండి.
  2. గేమ్‌ను తెరవండి. 

నోట్స్ తీసుకోండి

మీరు Google Keepను ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో నోట్స్ తీసుకోవచ్చు. ముందుగా, మీరు ఇప్పటికే నోట్స్ తీసుకున్నట్లయితే, మీరు వాటిని సేవ్ చేయాలి, తద్వారా మీరు వాటిని ఆఫ్‌లైన్‌లో చదవవచ్చు, ఎడిట్ చేయవచ్చు:

  1. మీ Chromebook ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి.
  2. మీ స్క్రీన్ మూలన, లాంచర్ ను ఎంచుకోండి.
  3. Google Keep యాప్ Keepను తెరవండి.
  4. కొన్ని నిమిషాలు వేచి ఉండండి. మీ Chromebook మీ నోట్స్‌ను ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది, తద్వారా మీరు వాటిని ఆఫ్‌లైన్‌లో చూడవచ్చు.

మీ Chromebook మీ నోట్స్‌ను సేవ్ చేసిన తర్వాత, మీరు వాటిని ఆఫ్‌లైన్‌లో ఎడిట్ చేయవచ్చు లేదా కొత్త నోట్స్‌ను రాయవచ్చు. మీరు చేసే ఏవైనా మార్పులు మీరు తర్వాత ఆన్‌లైన్‌లోకి వచ్చినప్పుడు Google Keepలో కనిపిస్తాయి.

మీరు ఆఫ్‌లైన్‌లో చేయగలిగిన ఇతర టాస్క్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4491690522906719657
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false