Google Drive ఫైల్‌లను ఆఫ్‌లైన్‌లో ఉపయోగించండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాకపోయినప్పటికీ, కింది వాటితో పాటు ఫైల్‌లను చూడగలరు, ఎడిట్ చేయగలరు:

  • Google Docs
  • Google Sheets
  • Google Slides

ఫైల్స్‌ను వెబ్‌లోని Driveతో ఆఫ్‌లైన్‌లో ఉపయోగించండి

మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆన్ చేసే ముందు

  • మీరు తప్పనిసరిగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి ఉండాలి.
  • మీరు తప్పనిసరిగా Google Chrome లేదా Microsoft Edge బ్రౌజర్‌ను ఉపయోగించాలి.
  • ప్రైవేట్ బ్రౌజింగ్‌ను ఉపయోగించకండి.
  • Google డాక్స్ ఆఫ్‌లైన్ Chrome ఎక్స్‌టెన్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఆన్ చేయండి.
  • మీ ఫైళ్లను సేవ్ చేయడానికి మీ పరికరంలో తగినంత స్పేస్ అందుబాటులో ఉందని నిర్ధారించుకోండి.
Google Docs, Sheets & Slidesను ఆఫ్‌లైన్‌లో తెరవండి
  1. Google Chrome లేదా Microsoft Edgeను తెరవండి. Chromeలో అయితే, మీరు కోరుకున్న ఖాతాలోకి సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  2. drive.google.com/drive/settingsకు వెళ్లండి.
  3. "ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు ఈ పరికరంలో మీ ఇటీవలి Google Docs, Sheets, Slides ఫైల్స్‌ను క్రియేట్ చేయడం, తెరవడం, ఎడిట్ చేయడం" అనే ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
Google Docs, Sheets, Slidesను ఆఫ్‌లైన్ వినియోగానికి సేవ్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
  2. మీరు ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయాలనుకుంటున్న Google Docs, Sheets లేదా Slides ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి.
  3. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచండి Ready for offlineని క్లిక్ చేయండి.

పలు ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయడానికి, మీరు ఇతర ఫైళ్లపై క్లిక్ చేస్తున్నప్పుడు Shift లేదా Command (Mac)/Ctrl (Windows) నొక్కండి.

ఆఫ్‌లైన్ ఫైళ్ల ప్రివ్యూ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో, drive.google.com లింక్‌కు వెళ్లండి.
    • ముందుగా, మీరు ఆఫ్‌లైన్ యాక్సెస్‌ను ఆన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  2. ఎగువున కుడి వైపు, ఆఫ్‌లైన్ కోసం సిద్ధం చేయి Ready for offlineని క్లిక్ చేయండి.
  3. ఆఫ్‌లైన్ ప్రివ్యూ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
ఆఫ్‌లైన్ ఫైళ్లను ఎడిట్ చేయండి

మీరు ఒక ఫైల్‌ను ఆఫ్‌లైన్‌లో ఎడిట్ చేసినట్లయితే:

  • మీరు తిరిగి ఆన్‌లైన్‌‌కు వచ్చినప్పుడు మార్పులు అమలు చేయబడతాయి.
  • కొత్త మార్పులు మునుపటి మార్పులను ఓవర్‌రైట్ చేస్తాయి.
  • మీరు ఫైల్‌కు సంబంధించిన వెర్షన్ హిస్టరీలో ఎడిట్‌లను చూడవచ్చు.

చిట్కా: Learn how to ఫైల్‌లో ఏమి మార్చబడిందో కనుగొనడం ఎలాగో తెలుసుకోండి.

డెస్క్‌టాప్ Driveతో ఫైల్స్‌ను ఆఫ్‌లైన్‌లో ఉపయోగించండి

డెస్క్‌టాప్ Drive అనేది Windows, macOSల కోసం ఉద్దేశించిన అప్లికేషన్, అది మీ డెస్క్‌టాప్ నుండి నేరుగా కంటెంట్‌ను త్వరగా యాక్సెస్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది, అలాగే తెలిసిన లొకేషన్‌లో గల ఫైళ్లను, ఫోల్డర్‌లను సులభంగా యాక్సెస్ చేయడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఫైళ్లను, ఫోల్డర్‌లను మిర్రర్ చేస్తే, ఆ కంటెంట్ ఎల్లప్పుడూ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు ఫైళ్లను, ఫోల్డర్‌లను స్ట్రీమ్ చేస్తే, మీరు నిర్దిష్ట ఐటెమ్‌లను ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచవచ్చు. మీ ఫైల్స్‌ను స్ట్రీమ్ చేయడం లేదా మిర్రర్ చేయడం అంటే ఏమిటో తెలుసుకోండి.

ముఖ్య గమనికలు:

ఆఫ్‌లైన్ వినియోగం కోసం Google యేతర ఫైళ్లను సేవ్ చేయండి

Google Docs, Sheets లేదా Slides కాని స్ట్రీమ్ చేసిన ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచడానికి:

Windowsలో:
  1. File Explorerకు వెళ్లండి.
  2. Google Drive ఫోల్డర్‌ను తెరవండి .
  3. ఫైళ్లను లేదా ఫోల్డర్‌లను ఎంచుకోండి.
    • ఒకటి కంటే ఎక్కువ ఎంచుకోవడానికి, Shift నొక్కి పట్టుకుని, క్లిక్ చేయండి.
  4. మీ ఫైళ్లపై లేదా ఫోల్డర్‌లపై కుడి క్లిక్ చేయండి.
  5. ఆఫ్‌లైన్ యాక్సెస్ ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచండి ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందిని క్లిక్ చేయండి.
    • మీరు ఫైల్‌ను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసినప్పుడు, దాని పక్కన ఒక ఆకుపచ్చని ఎంపిక గుర్తు కనిపిస్తుంది.

MacOSలో:

  1. Finder అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. Google Drive ఫోల్డర్‌ను తెరవండి .
  3. ఫైళ్లను లేదా ఫోల్డర్‌లను ఎంచుకోండి.
    • ఒకటి కంటే ఎక్కువ ఎంచుకోవడానికి, Shift నొక్కి పట్టుకుని, క్లిక్ చేయండి.
  4. మీ ఫైళ్లపై లేదా ఫోల్డర్‌లపై కుడి క్లిక్ చేయండి.
  5. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • మీరు ఫైల్‌ను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసినప్పుడు, దాని పక్కన ఒక ఆకుపచ్చని ఎంపిక గుర్తు కనిపిస్తుంది.

లోకల్ హార్డ్ డ్రైవ్‌లో స్టోరేజ్ వినియోగం

  • ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం కోసం ఫైళ్లను మార్క్ చేయడం వలన అవి లోకల్ హార్డ్ డ్రైవ్‌లో స్పేస్‌ను వినియోగిస్తాయి.
  • ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం కోసం ఫోల్డర్‌లను మార్క్ చేయడం వలన ఫోల్డర్‌లోని అన్ని ఫైళ్లు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి, అందువలన మరింత ఎక్కువ స్పేస్ ఉపయోగించబడుతుంది. సదరు ఫోల్డర్‌కు జోడించిన కొత్త ఐటెమ్‌లు ఆటోమేటిక్‌గా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
  • 'ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచండి' అని మార్క్ చేయబడిన అన్ని ఫైళ్లను చూడటానికి, మీరు డెస్క్‌టాప్ Drive మెనూలో "ఆఫ్‌లైన్ ఫైళ్లు" డైలాగ్‌ను తెరవవచ్చు.
స్ట్రీమింగ్, మిర్రరింగ్‌లలో ఆఫ్‌లైన్ లభ్యత విషయంలో వ్యత్యాసాలు

స్ట్రీమింగ్‌తో:

  • మీ ఫైల్స్ క్లౌడ్‌లో ఉంటాయి. మీరు ఫైళ్లను తెరిచినప్పుడు లేదా వాటిని ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పుడు లేదా ఇటీవల, తరచుగా ఉపయోగించే ఫైళ్ల కోసం మాత్రమే హార్డ్ డ్రైవ్ స్పేస్ ఉపయోగించబడుతుంది.
  • మీరు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసినప్పుడు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో లేని ఫైళ్లను మాత్రమే యాక్సెస్ చేయగలరు.
  • మీరు యాప్ రన్ అవుతున్నప్పుడు మాత్రమే ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఫైళ్లను యాక్సెస్ చేయగలరు.

మిర్రరింగ్‌తో:

  • మీ ఫైళ్లు క్లౌడ్, ఇంకా మీ కంప్యూటర్‌లో ఉంటాయి, ఇది మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ స్పేస్‌ను తీసుకుంటుంది.
  • మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా లేదా డెస్క్‌టాప్ యాప్ కోసం Drive రన్ అవ్వకపోయినా కూడా మీరు మీ ఫైళ్లను ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు.

మీరు మీ ఫైల్‌ను, ఫోల్డర్‌లను మిర్రర్ చేస్తే, అవి ఆటోమేటిక్‌గా ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. మీరు ఫైళ్లను, ఫోల్డర్‌లను స్ట్రీమ్ చేస్తే, మీరు నిర్దిష్ట ఐటెమ్‌లను ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచవచ్చు. మీ ఫైళ్లను మిర్రర్ చేయడం లేదా స్ట్రీమ్ చేయడం అంటే ఏమిటో మరింత తెలుసుకోండి.

 
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
171124482689555149
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false