Google Driveతో స్క్రీన్ రీడర్‌ను ఉపయోగించండి

Google Driveతో మొబైల్ పరికరం, టాబ్లెట్, లేదా కంప్యూటర్ నుండి ఫైళ్లు, ఫోల్డర్‌లను స్టోర్ చేయండి, షేర్ చేయండి, అలాగే వాటిలో కలిసి పని చేయండి.

ఈ ఆర్టికల్‌లో చాలా కంటెంట్ ఉంది, ఈ ఆర్టికల్‌లోని నిర్దిష్ట విభాగానికి త్వరగా వెళ్లడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:

  • ప్రారంభించండి
  • స్క్రీన్ రీడర్‌తో Google Driveలో సాధారణ టాస్క్‌లను పూర్తి చేయండి
    • ఫైల్‌ను తెరవండి
    • లిస్ట్ వీక్షణకు సంబంధించిన లేఅవుట్‌ను మార్చండి
    • మీడియాను ప్లే చేయండి
    • సూచించిన ఫైళ్లను ఉపయోగించండి
    • లిస్ట్ వీక్షణలో ఉన్న వాటిని మార్చండి
    • ఫైళ్ల కోసం సెర్చ్ చేయండి
    • ఫైళ్లను లొకేట్ చేయడానికి త్వరిత మార్గాలు
    • ఫోల్డర్‌లను, ఫైళ్లను క్రియేట్ చేయండి
    • ఫైళ్లను, ఫోల్డర్‌లను ఆర్గనైజ్ చేయండి
    • ఫైళ్లను, ఫోల్డర్‌లను షేర్ చేయండి
    • సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి
    • సహాయం పొందండి

ప్రారంభించండి

సిఫార్సు చేయబడిన బ్రౌజర్‌లు, స్క్రీన్ రీడర్‌లు

మీ కంప్యూటర్‌లో, ఈ బ్రౌజర్‌లు, స్క్రీన్ రీడర్‌లతో Google Drive ఉత్తమంగా పని చేస్తుంది:

ప్లాట్‌ఫామ్

బ్రౌజర్

స్క్రీన్ రీడర్

Chrome OS

Chrome

ChromeVox

Windows

Chrome (సిఫార్సు చేయబడింది)

Firefox

JAWS లేదా NVDA

Mac

Chrome (సిఫార్సు చేయబడింది)

Safari

VoiceOver

Getting started with Google Drive using a screen reader

 

మీరు ఈ వీడియోలో Firefoxతో NVDAని ఉపయోగిస్తూ Google Driveను ఎలా ప్రారంభించాలి అనేది నేర్చుకుంటారు.

డెస్క్‌టాప్ Driveను ఆటోమేటిక్‌గా సింక్ చేయండి

మీరు మీ కంప్యూటర్‌లోని Drive ఫైళ్లను ఆటోమేటిక్‌గా వెబ్‌లోని Drive ఫైళ్లతో సింక్ చేయగలరు.

మీరు డెస్క్‌టాప్ Driveను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీ కంప్యూటర్‌లో Google Drive ఫోల్డర్ ద్వారా నావిగేట్ చేయండి. మీ సాధారణ స్క్రీన్ రీడర్ కీస్ట్రోక్‌లను ఉపయోగించండి.

ఆ ఫైల్ లేదా ఫోల్డర్‌కు వెళ్లడానికి:

  1. ఫైల్ లేదా ఫోల్డర్ పేరులోని మొదటి అక్షరాన్ని ఎంటర్ చేయండి.
  2. ఫోల్డర్‌ల మధ్య ఉన్న ఫైళ్లను కట్ చేసి, పేస్ట్ చేయండి.

డెస్క్‌టాప్ Driveను ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకోండి.

Google Docs, Sheets, ఇంకా Slides

Docs, Sheets, Slides లేదా Formsను ప్రారంభించడానికి, స్క్రీన్ రీడర్‌తో Docs ఎడిటర్‌లను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

Androidలో Google Driveతో పని చేసే స్క్రీన్ రీడర్‌లు

మీ Android పరికరంలో TalkBack, BrailleBack, స్విచ్ యాక్సెస్ లాంటి యాక్సెసిబిలిటీ ఫీచర్‌ల ద్వారా Driveను ఉపయోగించవచ్చు.

మీరు మీ Android పరికరంతో USB లేదా బ్లూటూత్ కీబోర్డ్‌ను ఉపయోగిస్తుంటే, మీరు కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు. Driveలో కీబోర్డ్ షార్ట్‌కట్‌ల గురించి తెలుసుకోండి.

మీరు TalkBackను ఉపయోగిస్తున్నట్లయితే:

  • ఫైల్‌ను Driveలో తెరవడానికి:
  1. ఫైల్‌ను ఫోకస్ చేయడానికి ట్యాప్ లేదా స్వైప్ చేయండి.
  2. దాన్ని తెరవడానికి డబుల్-ట్యాప్ చేయండి.
  • ఫైళ్ల పేరు మార్చడం లేదా తరలించడం వంటి ఇతర చర్యలను చేయడానికి:
  1. ఫైల్‌ను ఫోకస్ చేయడానికి ట్యాప్ లేదా స్వైప్ చేయండి.
  2. ఎంపిక చేయడానికి డబుల్-ట్యాప్ చేసి ఉంచండి.
  3. టూల్‌బార్‌లో, మరిన్ని చర్యలు ఆప్షన్‌ను తెరవండి.
  4. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి.

Android యాక్సెసిబిలిటీ సహాయంలో మరింత తెలుసుకోండి.

iOSలో Google Driveతో పని చేసే స్క్రీన్ రీడర్‌లు

మీ iPhone లేదా iPadలో స్క్రీన్ రీడర్ VoiceOverతో డ్రైవ్‌ను ఉపయోగించవచ్చు.

VoiceOverను ఆన్ చేయడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, సెట్టింగ్‌లను తెరవండి.
  2. సాధారణం ఆ తర్వాత యాక్సెసిబిలిటీ ఆ తర్వాత VoiceOver ఆప్షన్లను ట్యాప్ చేయండి.
  3. VoiceOverను ఆన్ చేయండి.

మరింత తెలుసుకోవడానికి, iPhoneలో Apple యాక్సెసిబిలిటీను సందర్శించండి.

Google Driveను వెబ్ అప్లికేషన్‌గా ఉపయోగించండి

Google Driveను "వెబ్‌పేజీ"కి బదులుగా "వెబ్ అప్లికేషన్"గా నావిగేట్ చేయడానికి మీ స్క్రీన్ రీడర్‌ను సెటప్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

మీరు Google Driveను వెబ్ అప్లికేషన్‌గా ఉపయోగించినప్పుడు, Google Driveను మరింత సులభంగా నావిగేట్ చేయడానికి మీరు Google Drive కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు కింద పేర్కొన్న విధంగా ఎంటర్ చేయవచ్చు:

  • ఐటెమ్‌లను క్రియేట్ చేయడం కోసం కొత్త మెనూను తెరవడానికి c ఎంటర్ చేయవచ్చు.
  • Drive సెర్చ్‌ను ప్రారంభించడానికి / ఎంటర్ చేయవచ్చు.
  • ఫైల్ నావిగేషన్ ఏరియాకు వెళ్లడానికి g ఎంటర్ చేసి, ఆపై n ఎంటర్ చేయవచ్చు.

Google Driveతో ఉపయోగించడానికి మీ స్క్రీన్ రీడర్‌ను సెటప్ చేయండి

మీ స్క్రీన్ రీడర్‌ను సెటప్ చేయడానికి, కింద పేర్కొన్న దశలను ఫాలో అవ్వండి:

  • JAWS: వర్చువల్ కర్సర్‌ను ఆఫ్ చేయడానికి, వర్చువల్ కర్సర్ ఆఫ్ అయ్యే వరకు Insert + z నొక్కండి.
  • NVDA: ఫోకస్ మోడ్‌కు మారడానికి, Insert + Space నొక్కండి.
  • ChromeVox: స్టిక్కీ మోడ్ ఆఫ్‌లో ఉందని నిర్ధారించుకోండి. స్టిక్కీ మోడ్‌ను ఆఫ్ చేయడానికి, సెర్చ్ కీని రెండుసార్లు నొక్కండి.
  • VoiceOver: QuickNav ఆఫ్‌లో ఉందని నిర్ధారించుకోండి. VoiceOver, “QuickNav ఆఫ్ చేయబడింది” అని చెప్పే వరకు ఎడమ వైపు బాణం, కుడి వైపు బాణం కీలను నొక్కండి.

Google Driveను తెరవండి

మీ బ్రౌజర్‌లో, drive.google.com కు వెళ్లండి.

Google Drive ఇంటర్‌ఫేస్ వివరణ

Google Driveలో, 7 ప్రధాన ఏరియాలు ఉన్నాయి:

  • స్క్రీన్ ఎగువ భాగం: ఈ ఏరియా కింద పేర్కొన్న వాటికి కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది:
    • ఫోల్డర్‌లు, ఫైళ్ల కోసం Driveను సెర్చ్ చేయడానికి
    • సపోర్ట్‌ను పొందండి
    • ఇతర అప్లికేషన్‌లను తెరవడానికి
    • యాక్టివ్ ఖాతాను మార్చడానికి
    • ఫోల్డర్‌లను, ఫైళ్లను క్రియేట్ చేయడానికి
  • కింద పేర్కొన్న వాటితో యాక్సెసిబిలిటీ మెనూ:
    • ప్రధాన కంటెంట్‌కు స్కిప్ చేయడానికి సంబంధించిన బటన్
    • కీబోర్డ్ షార్ట్‌కట్‌ల బటన్
    • యాక్సెసిబిలిటీ ఫీడ్‌బ్యాక్ బటన్
  • ఎడమ వైపు నావిగేషన్: ఈ ఏరియా ప్రధాన వీక్షణను కింది వాటికి మారుస్తుంది:
    • ముఖ్యమైన ఫైల్స్: అన్ని ప్రాధాన్యత లేదా ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆబ్జెక్ట్‌లు.
    • నా డ్రైవ్: మీరు క్రియేట్ చేసిన లేదా ఇతరుల నుండి జోడించిన ఫైల్స్ ఆబ్జెక్ట్‌లను (ఫైళ్లు, ఫోల్డర్‌లు, షార్ట్‌కట్‌లు) కలిగి ఉన్న మీ డ్రైవ్.
    • షేర్ చేసిన డ్రైవ్‌లు: సంస్థకు చెందిన, టీమ్ డ్రైవ్‌లో స్టోర్ చేయబడిన ఫైళ్లు, ఫోల్డర్‌లు.
    • కంప్యూటర్‌లు: మీరు మీ కంప్యూటర్‌లో ఫోల్డర్‌లను సింక్ చేసినట్లయితే, లోకల్ ఫైళ్లు, ఫోల్డర్‌లను యాక్సెస్ చేయండి.
    • నాతో షేర్ చేసినవి: మీతో షేర్ చేయబడిన ఫైళ్లు, ఫోల్డర్‌ల వీక్షణ లిస్ట్.
    • ఇటీవల యాక్సెస్ చేసినవి: ఇటీవల యాక్సెస్ చేసిన ఫైళ్ల వీక్షణ లిస్ట్.
    • స్టార్ ఉన్నవి: మీరు స్టార్ పెట్టిన ఫైళ్లు, ఫోల్డర్‌ల వీక్షణ లిస్ట్.
    • ట్రాష్: మీరు తొలగించిన ఫైళ్లు, ఫోల్డర్‌ల వీక్షణ లిస్ట్.
    • స్టోరేజ్: ఫైళ్ల వీక్షణ లిస్ట్, ఫైల్ సైజ్. ఇందులో బ్యాకప్‌లకు యాక్సెస్ కూడా ఉంటుంది.
  • ఫైల్, ఫోల్డర్ లిస్ట్: ఇది ప్రధాన ఏరియా, ఇక్కడ ఫోల్డర్‌లు, ఫైళ్ల లిస్ట్ ఉంటుంది. లిస్ట్‌కు సంబంధించిన కంటెంట్ ఎడమ నావిగేషన్ ఏరియా ద్వారా కంట్రోల్ చేయబడుతుంది.
    • ముఖ్య గమనిక: ఆబ్జెక్ట్‌లు గ్రిడ్ లేదా లిస్ట్‌గా ప్రెజెంట్ చేయబడవచ్చు. 'నా డ్రైవ్' వీక్షణలో ఉన్నప్పుడు, సూచించబడిన ఫైళ్ల కోసం ఒక విభాగం ఉంటుంది.
  • బటన్‌లతో టూల్‌బార్: ఈ ఏరియా వీక్షణ, ఇతర సెట్టింగ్‌లను మార్చడానికి ఉద్దేశించబడింది.
  • వీక్షణ వివరాలు: ఈ ఏరియాలో ప్రస్తుతం ఎంచుకున్న ఫోల్డర్ లేదా ఫైల్ గురించిన సమాచారం ఉంటుంది. వివరాలు, యాక్టివిటీ కోసం విభాగాలు ఉన్నాయి.
  • కుడి వైపు సైడ్‌బార్: విస్తరించినప్పుడు, ఈ ప్రాంతం Keep, Tasks, Contacts వంటి ఇతర Google యాప్‌లకు క్విక్ యాక్సెస్‌ను అందిస్తుంది.

Google Driveలో షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

మీ Google Driveను నావిగేట్ చేయడంలో, టాస్క్‌లను అమలు చేయడంలో మీకు సహాయపడటానికి అనేక షార్ట్‌కట్‌లు ఉన్నాయి.

అందుబాటులో ఉన్న కొన్ని షార్ట్‌కట్‌లు ఇక్కడ ఉన్నాయి:

ఈ పని చేయడానికి

నొక్కండి

షార్ట్‌కట్‌ల పూర్తి లిస్ట్‌ను యాక్సెస్ చేయడం

Ctrl + / లేదా CMD + /

మెనూలు

ఈ పని చేయడానికి

నొక్కండి

క్రియేట్ చేయడానికి సంబంధించిన మెనూను తెరవడం

c

చర్యల మెనూను తెరవడం

A లేదా Shift + F10

సెట్టింగ్‌ల మెనూను తెరవడం

t

'నా డ్రైవ్' ఫైల్, ఫోల్డర్ చర్యల మెనూను తెరవడం

f

నావిగేట్ చేయడానికి సంబంధించిన షార్ట్‌కట్‌లు

ఈ పని చేయడానికి

నొక్కండి

ఫైల్ లిస్ట్‌కు నావిగేట్ చేయడం

g నొక్కి, ఆపై l నొక్కాలి

ఎడమ వైపు నావిగేషన్‌కు సంబంధించిన ఫోల్డర్‌లకు లేదా వీక్షణలకు నావిగేట్ చేయడానికి

g నొక్కి, ఆపై n నొక్కాలి లేదా g నొక్కి, ఆపై f నొక్కాలి

వివరాలను టోగుల్ చేయడం

d

యాక్టివిటీని టోగుల్ చేయడం

i

లిస్ట్ లేదా గ్రిడ్ వీక్షణల మధ్య టోగుల్ చేయడం

v

ఆబ్జెక్ట్‌లను క్రియేట్ చేయడానికి సంబంధించిన షార్ట్‌కట్‌లు

ఈ పని చేయడానికి

నొక్కండి

Google డాక్‌ను క్రియేట్ చేయడం

Shift + t

Google షీట్‌ను క్రియేట్ చేయడం

Shift + s

Google ప్రెజెంటేషన్‌ను క్రియేట్ చేయడం

Shift + p

ఫోల్డర్‌ను క్రియేట్ చేయడం

Shift + f

ఫోల్డర్‌ను అప్‌లోడ్ చేయడం

Shift + i

ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం

Shift + u

షార్ట్‌కట్ ప్రాథమిక అంశాలు

  • మెనూతో అనుబంధించబడిన అక్షరం ద్వారా మెనూను తెరవండి:
    • aతో చర్యలు.
    • cతో క్రియేట్ చేయడం.
    • tతో సెట్టింగ్‌లు.
  • షార్ట్‌కట్ g , అలాగే మరో అక్షరం నొక్కడం ద్వారా ఒక ఏరియాకు నావిగేట్ చేయండి. ఉదాహరణకు, ప్రస్తుత ఫైళ్లు లేదా ఫోల్డర్‌ల లిస్ట్‌కు వెళ్లడానికి g నొక్కి, ఆపై l నొక్కండి.
  • ఫారమ్‌కు సంబంధించిన క్రియేషన్ షార్ట్‌కట్‌లతో ఒక ఆబ్జెక్ట్‌ను త్వరగా క్రియేట్ చేయడానికి, కింద పేర్కొన్న విధంగా నొక్కండి:
    • ఫోల్డర్ కోసం Shift + f నొక్కండి.
    • Google Docsలో టెక్స్ట్ కోసం Shift + t నొక్కండి.
  • ఆపరేటింగ్ సిస్టమ్ షార్ట్‌కట్‌లతో చర్యల మెనూను తెరవడానికి, కింద పేర్కొన్న విధంగా నొక్కండి:
    • Windowsలో Shift + F10 లేదా అప్లికేషన్ కీ.
    • ChromeOSలో Search + m.
    • Macలో a.

స్క్రీన్ రీడర్‌తో Google Driveలో టాస్క్‌లను పూర్తి చేయండి

ఫైల్‌ను తెరవండి

  1. drive.google.com తో మీ బ్రౌజర్‌లో Driveను తెరవండి.
  2. కావాల్సిన ఫైల్‌ను లొకేట్ చేయడానికి, బాణం కీలను ఉపయోగించండి.
    • వీక్షణ అనేది లిస్ట్ వీక్షణ అయితే, పై వైపు, కింది వైపు బాణం కీలను ఉపయోగించండి.
    • వీక్షణ అనేది గ్రిడ్ వీక్షణ అయితే, పై వైపు, కింది వైపు, అలాగే ఎడమ వైపు, కుడి వైపు బాణం కీలను ఉపయోగించండి.
  3. ఎంచుకున్న ఆబ్జెక్ట్‌ను తెరవడానికి, Enter నొక్కండి.
    • ఫోల్డర్‌లు: ఫోల్డర్‌లో ఉన్న ఫైళ్ల లిస్ట్‌ను తెరవండి.
    • Files:
      • Docs, Sheets, లేదా Slides వంటి Workspace ఫైళ్లు కొత్త బ్రౌజర్ ట్యాబ్‌లో తెరవబడతాయి.
      • ఇతర ఫైళ్లు సిస్టమ్ స్థాయిలో లేదా మీరు ఇష్టపడే థర్డ్-పార్టీ అప్లికేషన్‌లో తెరవబడతాయి.
    • మీడియా: అదే బ్రౌజర్ ట్యాబ్‌లోని పాప్-అప్ ప్లేయర్‌లో తెరవబడుతుంది.

చిట్కా: పేరెంట్ ఫోల్డర్‌కు తిరిగి రావడానికి, ఈ పద్ధతుల్లో ఒక దాన్ని ఉపయోగించండి:

  • Windows, ChromeOS: Alt + ఎడమ వైపు బాణం కీని నొక్కండి.
  • అన్ని ప్లాట్‌ఫామ్‌లు: g నొక్కి, ఆపై p నొక్కండి.

లిస్ట్ వీక్షణకు సంబంధించిన లేఅవుట్‌ను మార్చండి

ఫైల్ లిస్ట్‌లోని ఫైళ్లు, ఫోల్డర్‌లను లిస్ట్ లేదా గ్రిడ్ వీక్షణలో చూపవచ్చు.

  • లిస్ట్ వీక్షణ: ఒక్కో అడ్డు వరుసకు ఒక ఫైల్ ప్రదర్శించబడుతుంది. చివరి మోడిఫయర్, తేదీ వంటి మరిన్ని లక్షణాలు చేర్చబడతాయి.
  • గ్రిడ్ వీక్షణ: ప్రతి అడ్డు వరుసలో పలు ఫైళ్లు ఉంటాయి. పేరు, రకం మాత్రమే చేర్చబడతాయి.

ఈ పద్ధతుల్లో ఒక దానితో 2 వీక్షణల మధ్య మారండి:

  • v నొక్కండి.
  • లిస్ట్ వీక్షణ లేదా గ్రిడ్ వీక్షణ బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కి, ఆపై Enter నొక్కండి.

క్రమపద్ధతి:

  1. "క్రమపద్ధతిలో అమర్చే దిశను రివర్స్ చేయండి" బటన్‌కు వెళ్లడానికి, Shift + Tab నొక్కండి.
  2. Enterను నొక్కండి. ఫోకస్ ఆటోమేటిక్‌గా ఫైళ్లు లేదా ఫోల్డర్‌ల లిస్ట్‌కు తిరిగి వస్తుందని గమనించండి.

ఫీల్డ్‌ను క్రమపద్ధతిలో అమర్చండి:

  1. “పేరు ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చడానికి సంబంధించిన బటన్ మెనూ”కు వెళ్లడానికి, Shift + Tab రెండుసార్లు నొక్కి, ఆపై Enter నొక్కండి.
  2. కావాల్సిన క్రమబద్ధీకరణ ప్రమాణాలను గుర్తించడానికి పై వైపు, కింది వైపు బాణం కీలను ఉపయోగించండి.
  3. Enterను నొక్కండి. ఫోకస్ ఆటోమేటిక్‌గా ఫైళ్లు లేదా ఫోల్డర్‌ల లిస్ట్‌కు తిరిగి వస్తుందని గమనించండి.

చిట్కా: ఫీల్డ్‌ను క్రమపద్ధతిలో అమర్చడానికి సంబంధించిన మెనూకు ఫోకస్‌ను త్వరగా తరలించడానికి, r నొక్కండి.

మీడియాను ప్లే చేయండి

  1. మీరు ప్లే చేయాలనుకుంటున్న మీడియాను ఎంచుకోండి.
  2. Enterను నొక్కండి.
  3. మీడియా తెరవబడిన తర్వాత, కింది ఆప్షన్‌లు అందుబాటులో ఉంటాయి:

ఫీచర్

చర్య

పాజ్ లేదా ప్లే చేయడం

ప్లేయర్ విండోపై ఫోకస్‌తో kను ఉపయోగించండి, లేదా 'ప్లే చేయండి' బటన్‌కు నావిగేట్ చేసి, ఆపై Enter కీ లేదా Space బార్‌ను నొక్కండి.

మ్యూట్ చేయండి

వాల్యూమ్ బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కి, Space బార్ లేదా Enter కీ నొక్కండి.

వాల్యూమ్

వాల్యూమ్ బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కండి. కింద పేర్కొన్న పనులు చేయడానికి:

  • వాల్యూమ్ పెంచడానికి, పై వైపు బాణం కీని ఉపయోగించండి.
  • వాల్యూమ్‌ను తగ్గించడానికి, కింది వైపు బాణం కీని ఉపయోగించండి.

క్యాప్షన్

tab కీతో క్యాప్షన్ బటన్‌కు నావిగేట్ చేయండి. యాక్టివేట్ చేయడానికి Space బార్ లేదా Enter కీ నొక్కండి.

ఫుల్ స్క్రీన్

f నొక్కండి లేదా tabతో ఫుల్ స్క్రీన్ బటన్‌కు నావిగేట్ చేయండి.

మీడియా సెట్టింగ్‌ల కోసం, సెట్టింగ్‌ల బటన్‌కు నావిగేట్ చేయడానికి tab కీని ఉపయోగించండి. కింద పేర్కొన్న సెట్టింగ్‌లను యాక్టివేట్ చేయడానికి, Enter లేదా Space నొక్కండి:

ఫీచర్

చర్య

ప్లేబ్యాక్ వేగం

వేరియబుల్ వేగం 0.25 నుండి 2 వరకు ఉంటుంది.

బాణం కీలు లేదా Shift + Tab ఉపయోగించి అనుకూల బటన్‌కు వెళ్లి, పై వైపు, కింది వైపు బాణం కీలతో అనుకూల వేగాన్ని సెట్ చేయండి. వేగాన్ని మార్చడానికి ఎడమ వైపు, కుడి వైపు బాణం కీలను ఉపయోగించండి.

సబ్‌టైటిల్స్ లేదా క్యాప్షన్‌లు

కింది వైపు బాణం కీతో సబ్‌టైటిల్స్‌ను ఎంచుకోండి.

కింద పేర్కొన్నటువంటి మరిన్ని సబ్‌టైటిల్ సెట్టింగ్‌లకు సంబంధించిన ఆప్షన్‌ల కోసం Shift + Tabను నొక్కండి:

  • ఫాంట్ ఫ్యామిలీ
  • ఫాంట్ రంగు
  • ఫాంట్ సైజ్
  • బ్యాక్‌గ్రౌండ్ రంగు
  • బ్యాక్‌గ్రౌండ్ అస్పష్టత
  • విండో రంగు
  • విండో అస్పష్టత
  • విండో అంచు స్టయిల్
  • ఫాంట్ అస్పష్టత
  • రీసెట్ బటన్

క్వాలిటీ

720p, 360p, లేదా ఆటో ఆప్షన్‌లలో ఏదైనా వీడియో క్వాలిటీని ఎంచుకోవడానికి, కింది వైపు బాణం కీని నొక్కండిఆ తర్వాతఎంచుకోవడానికి Enter నొక్కండి.

పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్

పిక్చర్-ఇన్-పిక్చర్ బటన్‌కు నావిగేట్ చేయడానికి Tab కీని నొక్కి, యాక్టివేట్ చేయడానికి Space లేదా Enter నొక్కండి.

సూచించిన ఫైళ్లను ఉపయోగించండి

ఫైళ్లు, ఫోల్డర్‌ల లిస్ట్ వీక్షణ 'నా డ్రైవ్' అయినప్పుడు, Google సహాయక ఇంటెలిజెన్స్ మీ కోసం ఫైళ్లను సూచిస్తుంది.

  1. ఈ పద్ధతుల్లో ఒక దానితో సూచించిన ఫైళ్ల ఏరియాకు ఫోకస్‌ను తరలించండి:
    • g నొక్కి, ఆపై q నొక్కండి.
    • మీరు సూచించిన ప్రాంత లిస్ట్‌ను వినే వరకు ఫైళ్ల లిస్ట్ నుండి Shift + Tabను నొక్కండి.
    • ఫైళ్ల లిస్ట్‌ను నావిగేట్ చేయడానికి ఎడమ వైపు, కుడి వైపు బాణం కీలను ఉపయోగించండి.
  1. ఎంచుకున్న ఫైల్‌ను తెరవడానికి Enter నొక్కండి.

ముఖ్య గమనిక: వీక్షణ అనేది 'ముఖ్యమైన ఫైల్స్' అయినప్పుడు లేదా 'నా డ్రైవ్' రూట్ ఫోల్డర్‌లో ఉన్నప్పుడు మాత్రమే సూచించిన ఫైళ్లు కనిపిస్తాయి.

లిస్ట్ వీక్షణలో ఉన్న వాటిని మార్చండి

  1. ఈ పద్ధతుల్లో ఒక దానితో ఎడమ వైపు నావిగేషన్‌కు నావిగేట్ చేయండి:
    • gను నొక్కి, ఆపై nను నొక్కండి లేదా gను నొక్కి, ఆపై fను నొక్కండి.
    • మీరు "ఫోల్డర్‌లు, వీక్షణల ట్రీ వ్యూ" అని వినే వరకు Shift + Tabను పలుసార్లు నొక్కండి.
  1. కింది వాటిలో ఒక దాన్ని ఎంచుకోవడానికి పై వైపు, కింది వైపు బాణం కీలను ఉపయోగించండి:
    • ప్రాధాన్యత
    • నా డ్రైవ్
    • షేర్ చేసిన డ్రైవ్‌లు
    • నాతో షేర్ చేసినవి
    • ఇటీవలివి
    • స్టార్ ఉన్నవి
    • ట్రాష్
    • స్టోరేజ్
  2. Enterను నొక్కండి.

ఎంచుకున్న వీక్షణ ఇప్పటికే యాక్టివ్ వీక్షణ అయితే తప్ప ఫైల్ లిస్ట్ మారుతుంది, ఫోకస్ ఫైల్ లిస్ట్‌కు తిరిగి తరలించబడుతుంది.

చిట్కా: నా డ్రైవ్, షేర్ చేసిన డ్రైవ్ ఐటెమ్‌లు ట్రీలు.

  1. వీటిని ఉపయోగించండి:
    • ట్రీని విస్తరించడానికి కుడి వైపు బాణం కీ.
    • ట్రీని కుదించడానికి ఎడమ వైపు బాణం కీ.
  2. ట్రీని నావిగేట్ చేయడానికి పై వైపు, కింది వైపు బాణం కీలు.

ఫైళ్ల కోసం సెర్చ్ చేయండి

Google Driveలో ఫైళ్లను సెర్చ్ చేయడానికి 3 మార్గాలు ఉన్నాయి.

  • సెర్చ్ ఫీల్డ్‌లో, సెర్చ్ ప్రమాణాలను ఎంటర్ చేసి, Enter నొక్కండి. సెర్చ్ ప్రమాణాలకు మ్యాచ్ అయ్యే ఫైళ్లను కలిగి ఉండేలా ఫైల్ లిస్ట్ అప్‌డేట్ చేయబడుతుంది.
  • సెర్చ్ ఫీల్డ్స్‌లో, సెర్చ్ ప్రమాణాలను ఎంటర్ చేసి, ఆపై సెర్చ్ ప్రమాణాల ఆధారంగా ఫలితాలను యాక్సెస్ చేయడానికి కింది వైపు బాణం కీని ఉపయోగించండి.
  • సెర్చ్ ప్రమాణాలను ఎంటర్ చేయడానికి సెర్చ్ డైలాగ్‌ను ఉపయోగించండి. సెర్చ్ బటన్‌కు నావిగేట్ చేసి, Enterను నొక్కండి. సెర్చ్ ప్రమాణాలకు మ్యాచ్ అయ్యే ఫైళ్లను కలిగి ఉండేలా ఫైల్ లిస్ట్ అప్‌డేట్ చేయబడుతుంది.

“సెర్చ్ ఫీల్డ్”ను ఉపయోగించండి

  1. ఫోకస్‌ను సెర్చ్ ఫీల్డ్‌కు తరలించడానికి, / లేదా Tabను పలుసార్లు నొక్కండి.
  2. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • సెర్చ్ ఫీల్డ్‌లో, ప్రమాణాలను ఎంటర్ చేయండి.
      • ఫైళ్ల లిస్ట్‌లో ఫలితాలను యాక్సెస్ చేయడానికి:
        • Enterను నొక్కండి. ఫోకస్ ఆటోమేటిక్‌గా ఫైళ్ల లిస్ట్‌కు తరలించబడుతుంది.
        • సెర్చ్ ఫలితాలను రివ్యూ చేయడానికిబాణం కీలను ఉపయోగించండి.
      • కింది వైపు బాణం గుర్తుతో ఫలితాలను యాక్సెస్ చేయడానికి:
        • కింది వైపు బాణం కీని నొక్కండి.
        • ఐటెమ్‌ను ఉపయోగించడానికి Enterను నొక్కండి.

ముఖ్య గమనిక: సెర్చ్ ప్రమాణాలు డైనమిక్‌గా ఉంటాయి, అలాగే ఫైళ్లు లేదా ఫోల్డర్‌లను ఫిల్టర్ చేయడానికి ఏ రకమైన సెర్చ్‌కు అయినా నిర్దిష్టంగా ఉంటాయి.

కింద పేర్కొన్నటువంటి పదాలు ఉంటాయి:

  • వీరి నుండి:
    • నిర్దిష్ట యూజర్ లేదా సంస్థ ద్వారా పంపబడింది.
  • వీరికి:
    • నిర్దిష్ట యూజర్ లేదా సంస్థకు పంపబడింది.
  • ఓనర్:
    • నిర్దిష్ట యూజర్ లేదా సంస్థకు చెందినది.
  • షేర్ చేసినవి:
    • నిర్దిష్ట యూజర్ లేదా సంస్థకు షేర్ చేయబడింది.

సెర్చ్ క్వెరీల కోసం ఫిల్టర్ చేయడానికి మరిన్ని మార్గాలను తెలుసుకోవడానికి, Google Driveలో ఫైళ్లను కనుగొనండి అనే లింక్‌కు వెళ్లండి.

“సెర్చ్ డైలాగ్”ను ఉపయోగించండి

  1. సెర్చ్ ఫీల్డ్‌పై ఫోకస్ చేయడానికి, / నొక్కండి.
  2. సెర్చ్ ఆప్షన్‌ల బటన్‌కు వెళ్లడానికి నొక్కండి, ఆపై Enterను నొక్కండి.
  3. మీరు సెర్చ్ కోసం ఉపయోగించాలనుకుంటున్న డైలాగ్, ఆటో-ఫిల్ ఫీల్డ్స్ ద్వారా వెళ్లడానికి నొక్కండి.
  4. డైలాగ్ చర్య కోసం, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    1. Windows, అలాగే Chrome OSలో, Ctrl + Enter ఎంటర్ చేయండి.
    2. Macలో, Cmd + Enter ఎంటర్ చేయండి.
    3. సెర్చ్ బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కి, ఆపై Enter నొక్కండి.
  5. ఫైళ్ల లిస్ట్ ఫలితాలతో అప్‌డేట్ చేయబడుతుంది.

ఫైల్ వివరాలు, యాక్టివిటీ

ఫైల్, ఫైల్ యాక్టివిటీకి సంబంధించిన వివరాలు ఆన్ లేదా ఆఫ్ చేయగల వీక్షణలో అందుబాటులో ఉంటాయి.

  1. ఫైళ్ల లిస్ట్‌లో, ఒక ఫైల్‌ను ఎంచుకోండి.
  2. వివరాలకు ఫోకస్‌ను తరలించడానికి, g నొక్కి, ఆపై dను నొక్కండి.
  3. వివరాలు, యాక్టివిటీతో కూడిన ట్యాబ్ లిస్ట్‌పై ఫోకస్ ఉంటుంది. ఎడమ వైపు, కుడి వైపు బాణం కీలతో ట్యాబ్‌ల మధ్య ఎంచుకోండి. సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, Tabను నొక్కండి.
    1. వివరాలు:
      • డాక్యుమెంట్‌కు సంబంధించిన థంబ్‌నెయిల్‌ను చూపే చిన్న విండో.
      • డాక్యుమెంట్‌కు యాక్సెస్ ఉన్న వ్యక్తుల సమాచారం.
      • డాక్యుమెంట్ రకం, సైజ్, లొకేషన్, ఓనర్ వివరాలను చూపే సిస్టమ్ ప్రాపర్టీలు.
    2. యాక్టివిటీ:
      • డాక్యుమెంట్‌కు సంబంధించిన ఎడిట్ హిస్టరీని చూపుతుంది.

చిట్కా: వివరాలను, యాక్టివిటీని సులభంగా వినియోగించుకోవడానికి, వర్చువల్ కర్సర్‌ను ఆన్ చేయండి.

  • JAWS: Insert + z నొక్కండి.
  • NVDA: ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • బ్రౌజ్ మోడ్‌కు మారడానికి, Insert + Space నొక్కండి.
  • ChromeVox: స్టిక్కీ మోడ్‌ను ఆఫ్ చేయడానికి, Search కీని రెండుసార్లు నొక్కండి.
  • VoiceOver: QuickNavను ఆఫ్ చేయడానికి, VoiceOver, “QuickNav ఆఫ్ చేయబడింది” అని చెప్పే వరకు ఎడమ వైపు బాణం, కుడి వైపు బాణం కీలను నొక్కండి.

మీరు ఈ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు మీ స్క్రీన్ రీడర్ మిమ్మల్ని వర్చువల్ కర్సర్‌కు మార్చవచ్చు.

ఫైళ్లను లొకేట్ చేయడానికి త్వరిత మార్గాలు

“ఇటీవలివి”ని ఉపయోగించండి

మీరు ఇటీవల యాక్సెస్ చేసిన ఫైళ్లు ఇటీవలి వీక్షణలో అందుబాటులో ఉంటాయి.

  1. ఈ పద్ధతుల్లో ఒక దానితో ఎడమ వైపు నావిగేషన్‌కు నావిగేట్ చేయండి:
    • gను నొక్కి, ఆపై nను నొక్కండి లేదా gను నొక్కి, ఆపై fను నొక్కండి.
    • మీరు “ఫోల్డర్‌లు, వీక్షణలు” అని వినే వరకు Shift + Tabను పలుసార్లు నొక్కండి.
  1. "ఇటీవలి ఫైళ్ల" కోసం బాణం గుర్తును నొక్కండి.
  2. Enterను నొక్కండి. ఫోకస్ ప్రధాన ఏరియాకు తరలించబడుతుందని గమనించండి.

"స్టార్ ఉన్నవి"ని ఉపయోగించండి

మీరు త్వరగా గుర్తించాలనుకునే ఫైల్‌కు "స్టార్" పెట్టడానికి, మీరు తప్పనిసరిగా:

  1. కావాల్సిన ఫైల్‌కు వెళ్లండి.
  2. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • ఫైల్ లేదా ఫోల్డర్‌కు సంబంధించిన స్టార్‌ను తొలగించడానికి sను నొక్కండి.
    • చర్యల మెనూను ఉపయోగించడానికి, 'స్టార్ ఉన్నవి'కి జోడించడానికి aను నొక్కి, ఆపై బాణం గుర్తును నొక్కండి.

మీరు స్టార్ పెట్టిన ఫైళ్లను యాక్సెస్ చేయడానికి:

  1. ఈ పద్ధతుల్లో ఒక దానితో ఎడమ వైపు నావిగేషన్‌కు నావిగేట్ చేయండి:
    • gను నొక్కి, ఆపై nను నొక్కండి లేదా gను నొక్కి, ఆపై fను నొక్కండి.
    • మీరు “ఫోల్డర్‌లు, వీక్షణలు” అని వినే వరకు Shift + Tabను పలుసార్లు నొక్కండి.
  2. "స్టార్ ఉన్నవి"కి వెళ్లడానికి బాణం గుర్తును నొక్కండి
  3. Enterను నొక్కండి. మీరు ఇంతకు ముందు స్టార్ పెట్టిన ఫైళ్లు, ఫోల్డర్‌లను కలిగి ఉండేలా ఫైళ్ల లిస్ట్ అప్‌డేట్ చేయబడుతుంది.

“ముఖ్యమైన ఫైల్స్”ను ఉపయోగించండి

ముఖ్యమైన ఫైల్స్ వీక్షణ డ్రైవ్‌లో ఇటీవల మార్చబడిన, తరలించబడిన, కామెంట్ చేయబడిన డాక్యుమెంట్‌లు ఉంటాయి.

  1. ఎడమ నావిగేషన్ బార్‌లో, "ముఖ్యమైన ఫైల్స్"కు వెళ్లడానికి పై వైపు బాణాన్ని నొక్కండి.
  2. Enterను నొక్కండి.
  3. ఫైల్‌కు నావిగేట్ చేయడానికి కుడి వైపు బాణం కీను ఉపయోగించండి.
  4. చర్యల మెనూను తెరవడానికి, Tab నొక్కండి. మీరు కింద పేర్కొన్నటువంటి మరిన్ని ఆప్షన్‌లను పొందుతారు:
    • ప్రివ్యూ
    • దీనితో తెరువు
    • షేర్ చేయండి
    • లింక్‌ను పొందండి
    • వర్క్ స్పేస్‌కు జోడించండి
    • Driveకు షార్ట్‌కట్‌ను జోడించండి
    • స్టార్ ఉన్న వాటికి జోడించండి
    • కాపీని రూపొందించడం
    • దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయడం
    • డౌన్‌లోడ్ చేయడం

ఫోల్డర్‌లను, ఫైళ్లను క్రియేట్ చేయండి

ఫోల్డర్‌లను క్రియేట్ చేయండి

  1. ఈ పద్ధతుల్లో ఒక దానితో కొత్త మెనూను తెరవండి:
    • cను నొక్కండి.
    • మీరు "కొత్త బటన్ మెనూ" అని వినే వరకు Shift + Tab నొక్కి, ఆపై Enterను నొక్కండి.
  2. ఫోల్డర్ మెనూ ఐటెమ్‌కు వెళ్లడానికి బాణం కీను నొక్కండి.
  3. Enter నొక్కండి. ఫోల్డర్‌కు పేరు పెట్టడానికి ఒక డైలాగ్ కనిపిస్తుంది.
  4. ఫోల్డర్ పేరును ఎంటర్ చేయండి.
  5. Enterను నొక్కండి.

చిట్కా: త్వరగా ఫోల్డర్‌ను క్రియేట్ చేయడానికి, Shift + fను నొక్కండి.

ఫైళ్లను క్రియేట్ చేయండి

  1. ఈ పద్ధతుల్లో ఒక దానితో కొత్త బటన్ మెనూకు నావిగేట్ చేయండి:
    • c షార్ట్‌కట్‌ను నొక్కండి.
    • మీరు "కొత్త బటన్ మెనూ" అని వినే వరకు Shift + Tab నొక్కి, ఆపై Enterను నొక్కండి.
  2. మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఫైల్ రకాన్ని ఎంచుకోవడానికి కింది వైపు బాణం కీను నొక్కండి.
  3. సబ్‌మెనూను తెరవడానికి Enter లేదా బాణం బటన్‌ను నొక్కండి.
  4. రకాన్ని ఎంచుకోవడానికి బాణం కీలను ఉపయోగించండి.
  5. Enterను నొక్కండి. ఫైల్ కొత్త బ్రౌజర్ ట్యాబ్‌లో క్రియేట్ చేయబడుతుందని గమనించండి.

చిట్కా: ఫైల్‌ను త్వరగా క్రియేట్ చేయడానికి, దిగువున ఉన్న షార్ట్‌కట్‌లను ఉపయోగించండి:

రకం

నొక్కండి

ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం

Shift + u

ఫోల్డర్‌ను అప్‌లోడ్ చేయడం

Shift + i

Google డాక్

Shift + t

Google Sheet

Shift + s

ప్రెజెంటేషన్

Shift + p

డ్రాయింగ్

Shift + d

Google ఫారమ్

Shift + o

ఫైళ్లను అప్‌లోడ్ చేయండి

  1. కొత్త బటన్‌కు నావిగేట్ చేయడానికి, మీరు "కొత్త బటన్ మెనూ" అని వినే వరకు c లేదా Shift + Tab నొక్కండి.
  2. ఫైల్ అప్‌లోడ్ బటన్‌కు నావిగేట్ చేయడానికి కింది వైపు బాణం కీను ఉపయోగించండి.
  3. Enterను నొక్కండి.
  4. ఫైల్‌ను అప్‌లోడ్ చేయడానికి, మీ కంప్యూటర్ నుండి ఫైల్‌ను ఎంచుకుని, ఆపై Enterను నొక్కండి.

ఫోల్డర్‌లను అప్‌లోడ్ చేయండి

  1. కొత్త బటన్‌కు నావిగేట్ చేయడానికి, మీరు "కొత్త బటన్ మెనూ" అని వినే వరకు c లేదా Shift + Tab నొక్కండి.
  2. ఫోల్డర్ అప్‌లోడ్ బటన్‌కు నావిగేట్ చేయడానికి కింది వైపు బాణం కీను ఉపయోగించండి.
  3. Enterను నొక్కండి.
  4. ఫోల్డర్‌ను అప్‌లోడ్ చేయడానికి, మీ కంప్యూటర్ నుండి ఫోల్డర్‌ను ఎంచుకుని, Enterను నొక్కండి.

ఫోల్డర్‌లు, ఫైళ్లను ఆర్గనైజ్ చేయండి

మరొక ఫోల్డర్‌కు ఫైల్‌ను తరలించండి

  1. ఫైల్‌ను ఎంచుకోండి.
  2. చర్యల మెనూను తెరవడానికి, a లేదా Shift + F10 ను నొక్కండి.
  3. “దీనికి తరలించండి”కి వెళ్లడానికి కింది వైపు బాణాన్ని నొక్కండి.
  4. Enterను నొక్కండి.
    చిట్కా: ఏ సమయంలోనైనా Escape నొక్కడం ద్వారా తరలింపును రద్దు చేయవచ్చు.
  5. (ఆప్షనల్) మరొక డ్రైవ్‌కు తరలించడానికి:
    1. ఫైల్ ప్రస్తుతం స్టోర్ చేయబడిన డ్రైవ్ నుండి బయటకు నావిగేట్ చేయడానికి ఎడమ వైపు బాణాన్ని ఉపయోగించండి.
    2. కింది ఆప్షన్‌లలో ఒక దానికి తరలించడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీలను ఉపయోగించండి.
      • నా డ్రైవ్
      • షేర్ చేసిన డ్రైవ్‌లు
      • నాతో షేర్ చేసినవి
      • స్టార్ ఉన్నవి
    3. ఎంచుకున్న డ్రైవ్‌లోకి నావిగేట్ చేయడానికి కుడి వైపు బాణాన్ని ఉపయోగించండి.
  6. మీరు ఫైల్‌ను తరలించాలనుకుంటున్న ఫోల్డర్‌ను ఎంచుకోవడానికి పై వైపు లేదా కింది వైపు బాణం కీను ఉపయోగించండి.
  7. Enterను నొక్కండి.
  8. (ఆప్షనల్) కొత్త ఫోల్డర్‌ను క్రియేట్ చేయడానికి:
    1. "కొత్త ఫోల్డర్" బటన్‌కు నావిగేట్ చేయడానికి Tab కీని ఉపయోగించండి.
    2. Enterను నొక్కండి.
    3. మీ కొత్త ఫోల్డర్‌కు టైటిల్ ఇవ్వండి.
    4. Enterను నొక్కండి.
  9. మీరు ఎంచుకున్న ఫోల్డర్‌కు మీ ఫైల్‌ను తరలించడానికి "ఇక్కడకు తరలించండి" బటన్‌కు నావిగేట్ చేయడానికి Tab కీని ఉపయోగించండి.
  10. Enterను నొక్కండి.

క్లిప్‌బోర్డ్‌ను ఉపయోగించండి

ఫైళ్లు, ఫోల్డర్‌లను కాపీ చేయడానికి లేదా తరలించడానికి మీరు ఇప్పుడు క్లిప్‌బోర్డ్‌ను ఉపయోగించవచ్చు:

  1. ఫైల్ లేదా ఫోల్డర్‌ను ఎంచుకోండి.
  2. (ఆప్షనల్) ఒకటి కంటే ఎక్కువ ఎంచుకోవడానికి Shift + పై వైపు లేదా కింది వైపు బాణం కీలను నొక్కండి.
  3. ఎంచుకున్న ఫైళ్లు లేదా ఫోల్డర్‌లను కాపీ చేయడానికి Ctrl + C నొక్కండి లేదా వాటిని తరలించడానికి Ctrl + X నొక్కండి.
  4. మీరు వాటిని కాపీ చేయాలనుకుంటున్న లేదా తరలించాలనుకుంటున్న గమ్యస్థానానికి నావిగేట్ చేయండి.
  5. కాపీ లేదా తరలింపును పూర్తి చేయడానికి Ctrl + V నొక్కండి.
  6. ఫైల్ లేదా ఫోల్డర్ పేరు ఇప్పటికే ఉన్నట్లయితే, కొత్త ఫైల్ లేదా ఫోల్డర్ పేరు “Copy of…”తో ప్రారంభమవుతుంది

షార్ట్‌కట్‌ను క్రియేట్ చేయండి

షార్ట్‌కట్ అన్నది మరొక ఫైల్ లేదా ఫోల్డర్‌ను సూచించే లింక్. మీరు మీ డ్రైవ్‌లో లేదా షేర్ చేసిన డ్రైవ్‌లో షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు. ప్రతి ఐటెమ్ గరిష్ఠంగా కింద పేర్కొన్న విధంగా కలిగి ఉండవచ్చు:

  • మీరు చేసిన ఒక్కో ఫైల్ లేదా ఫోల్డర్‌లకు 500 షార్ట్‌కట్‌లు.
  • ఇతరులు చేసిన ఫైల్ లేదా ఫోల్డర్‌లు ఒక్కో ఫైల్‌కు 5,000 మొత్తం షార్ట్‌కట్‌లు.
  1. ఫైల్‌ను ఎంచుకోండి.
  2. చర్యల మెనూను తెరవడానికి, a లేదా Shift + F10 నొక్కండి.
  3. "డ్రైవ్‌కు షార్ట్‌కట్‌ను జోడించండి"కి వెళ్లడానికి కింది వైపు బాణాన్ని నొక్కండి.
  4. Enterను నొక్కండి.
  5. మీరు షార్ట్‌కట్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడ డ్రైవ్‌ను ఎంచుకోండి. ఈ సూచనలను ఫాలో అవ్వండి:
    1. మీ షార్ట్‌కట్ ప్రస్తుతం స్టోర్ చేయబడిన డ్రైవ్ నుండి బయటకు నావిగేట్ చేయడానికి ఎడమ వైపు బాణం లేదా "వెనుకకు వెళ్లండి" బటన్‌కు నావిగేట్ చేయండి.
    2. షార్ట్‌కట్‌ను తరలించడానికి కింద పేర్కొన్న డ్రైవ్‌లకు నావిగేట్ చేయండి:
      • నా డ్రైవ్
      • షేర్ చేసిన డ్రైవ్‌లు
    3. మీరు షార్ట్‌కట్‌ను తరలించాలనుకుంటున్న డ్రైవ్‌ను విస్తరించడానికి, కుడి వైపు బాణం కీను ఉపయోగించండి.
    4. "క్రియేట్ చేయండి"కి వెళ్లడానికి Tabను నొక్కండి.
    5. Enterను నొక్కండి.

సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

  1. "సెట్టింగ్‌ల"కు నావిగేట్ చేయడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • "సెట్టింగ్‌ల" బటన్‌ను నొక్కి, ఆపై Enterను నొక్కండి.
    • t నొక్కి, ఆపై Enterను నొక్కండి.
  2. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • సెట్టింగ్‌లు
      i. సెట్టింగ్‌లతో మీరు ఈ కింద పేర్కొన్న వాటి నుండి ఎంచుకోవచ్చు:
      • మీరు కింద పేర్కొన్న వాటిని సాధారణ సెట్టింగ్‌లలో మార్చవచ్చు:
        • మార్చడానికి సంబంధించిన అప్‌లోడ్ సెట్టింగ్‌లు
        • భాష సెట్టింగ్‌లు
        • ఆఫ్‌లైన్ సెట్టింగ్‌లు
        • సాంద్రత
        • సూచనల సెట్టింగ్‌లు
      • నోటిఫికేషన్‌ల సెట్టింగ్
      • యాప్‌లను మేనేజ్ చేయడం
    • డెస్క్‌టాప్ Driveను పొందండి (Windows, Macలు మాత్రమే)
    • కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

సెట్టింగ్‌లను నావిగేట్ చేయండి: సాధారణం

  1. సెట్టింగ్‌లకు నావిగేట్ చేయడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • "సెట్టింగ్‌ల" బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కి, ఆపై Enterను నొక్కండి.
    • t నొక్కి, ఆపై Enterను నొక్కండి.
  2. కింది వైపు బాణం కీతో, సాధారణ ట్యాబ్‌ను ఎంచుకోండి.
  3. Tab నొక్కండి.
  4. కింది ఆప్షన్‌లకు నావిగేట్ చేయడానికి, Tabను ఉపయోగించండి.
    • స్టోరేజ్: Google Drive కోసం ఉపయోగించిన మొత్తం స్టోరేజ్‌ను చూడండి, అలాగే స్టోరేజ్‌ను మేనేజ్ చేయండి.
      • "స్టోరేజ్‌ను మేనేజ్ చేయండి"కి వెళ్లడానికి Tab నొక్కండి.
      • Drive స్టోరేజ్ డేటాతో ఫైల్స్‌ను తెరవడానికి Enter నొక్కండి.
    • అప్‌లోడ్‌లను మార్చండి
      • “అప్‌లోడ్‌లను మార్చండి” చెక్‌బాక్స్‌కు వెళ్ళడానికి Tab నొక్కండి.
      • అప్‌లోడ్ చేసిన ఫైళ్లను Google Docs ఎడిటర్ ఫార్మాట్‌కు మార్చడం కోసం బాక్స్‌ను ఎంచుకోవడానికి లేదా ఎంపికను తీసివేయడానికి Space కీను నొక్కండి.
    • భాష
      • “భాష సెట్టింగ్‌ను మార్చండి” లింక్‌కు వెళ్లడానికి Tab నొక్కండి.
      • “భాష సెట్టింగ్‌లను మార్చండి” బటన్‌ను ఎంచుకోవడానికి Enterను నొక్కండి. ఇది మిమ్మల్ని Google ఖాతాల భాష సెట్టింగ్‌లకు తీసుకెళ్తుంది, ఇక్కడ మీరు Google యాప్‌ల ఖాతా మొత్తానికి వర్తించే భాషను మార్చవచ్చు.
    • ఆఫ్‌లైన్
      • "ఆఫ్‌లైన్" చెక్‌బాక్స్‌కు వెళ్లడానికి Tab నొక్కండి.
      • ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మీ పరికరంలో మీ ఇటీవలి Google Docs, Sheets, Slides, ఫైళ్లను క్రియేట్ చేయడానికి, తెరవడానికి, అలాగే ఎడిట్ చేయడానికి సంబంధించిన చెక్‌బాక్స్‌ను ఎంచుకోవడానికి లేదా ఎంపికను తీసివేయడానికి Space కీను నొక్కండి.
    • సాంద్రత
      • కుదించబడిన సబ్-మెనూ "సాంద్రత లిస్ట్"కు వెళ్లడానికి Tabను నొక్కండి.
      • Enter నొక్కండి.
      • కింది వాటికి సంబంధించి సాంద్రత సెట్టింగ్‌లను మార్చడానికి మెనూ ఐటెమ్‌లను ఎంచుకోవడానికి పై వైపు, కింది వైపు బాణాలను ఉపయోగించండి:
        • సౌకర్యవంతమైన ఆప్షన్: చిహ్నాల మధ్య మరింత ఖాళీ స్పేస్.
        • అనుకూలమైన ఆప్షన్: చిహ్నాల మధ్య సంక్షిప్తమైన ఆప్షన్ కంటే ఎక్కువ ఖాళీ స్పేస్, కానీ సౌకర్యవంతమైన ఆప్షన్ కంటే తక్కువ.
        • సంక్షిప్తమైన ఆప్షన్: చిహ్నాల మధ్య తక్కువ ఖాళీ స్పేస్.
      • సెట్టింగ్‌ను ఎంచుకోవడానికి Enter నొక్కండి.
    • సూచనలు:
      • "సూచనలు" చెక్‌బాక్స్‌లకు వెళ్లడానికి Tab నొక్కండి.
        • 'నా డ్రైవ్', షేర్ చేసిన డ్రైవ్‌లలో సూచించిన ఫైళ్లను చూడండి.
        • సూచించిన నాతో షేర్ చేయబడిన ఫైళ్లను చూడండి.
        • నా హోమ్ పేజీని ప్రాధాన్యత ఆటోమేటిక్ పేజీగా చేయండి.
      • చెక్‌బాక్స్‌ను ఎంచుకోవడానికి లేదా ఎంపికను తీసివేయడానికి Space నొక్కండి.

సెట్టింగ్‌లను నావిగేట్ చేయండి: నోటిఫికేషన్‌లు

  1. సెట్టింగ్‌లకు నావిగేట్ చేయడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • "సెట్టింగ్‌ల" బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కి, ఆపై Enterను నొక్కండి.
    • t నొక్కి, ఆపై Enterను నొక్కండి.
  2. కింది వైపు బాణం కీతో, నోటిఫికేషన్‌ల ట్యాబ్‌ను ఎంచుకోండి.
  3. Tab నొక్కండి.
  4. మెనూ ఐటెమ్‌లకు నావిగేట్ చేయడానికి Tab నొక్కండి.
    • బ్రౌజర్
      1. “బ్రౌజర్” చెక్‌బాక్స్‌కు వెళ్లడానికి Tab నొక్కండి.
      2. మీ బ్రౌజర్‌లో Google Drive ఐటెమ్‌ల గురించి అప్‌డేట్‌లను పొందడానికి చెక్‌బాక్స్‌ను ఎంచుకోవడానికి లేదా ఎంపికను తీసివేయడానికి Space నొక్కండి.
    • ఈమెయిల్
      1. “ఈమెయిల్” చెక్‌బాక్స్‌కు వెళ్లడానికి Tab నొక్కండి.
      2. మీ ఈమెయిల్ ద్వారా Google Drive ఐటెమ్‌ల గురించి అప్‌డేట్‌లను పొందడానికి చెక్‌బాక్స్‌ను ఎంచుకోవడం లేదా ఎంపికను తీసివేయడం కోసం Space నొక్కండి.

సెట్టింగ్‌లను నావిగేట్ చేయండి: యాప్‌లను మేనేజ్ చేయండి

  1. సెట్టింగ్‌లకు నావిగేట్ చేయడానికి, ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • "సెట్టింగ్‌ల" బటన్‌కు వెళ్లడానికి Tab నొక్కి, ఆపై Enterను నొక్కండి.
    • t నొక్కి, ఆపై Enterను నొక్కండి.
  2. కింది వైపు బాణం కీతో, యాప్‌లను మేనేజ్ చేయండి ట్యాబ్‌ను ఎంచుకోండి.
  3. Tab నొక్కండి.
  4. మెనూ ఐటెమ్‌లకు నావిగేట్ చేయడానికి Tab నొక్కండి.
    • ఒక్కో యాప్‌నకు సంబంధించిన "ఆటోమేటిక్ సెట్టింగ్‌ను ఉపయోగించండి" చెక్‌బాక్స్‌కు వెళ్లడానికి Tabను నొక్కండి.
    • యాప్ కోసం యాప్ వినియోగాన్ని తీసివేయడానికి లేదా సెట్ చేయడానికి చెక్‌బాక్స్‌ను ఎంచుకోవడం లేదా ఎంపికను తీసివేయడం కోసం Space నొక్కండి.

సహాయం పొందండి

  1. "సెట్టింగ్‌ల"కు నావిగేట్ చేసి, "సపోర్ట్ మెనూ"కు వెళ్లడానికి Shift + Tabను నొక్కండి.
  2. Enter నొక్కి, ఆపై "సహాయాన్ని" తెరవడానికి Enterను మరోసారి నొక్కండి.
  3. ఒక డైలాగ్ కనిపిస్తుంది. యాక్టివేట్ చేయడానికి, కింది వాటిని ఎంచుకుని, ఆపై Enterను నొక్కండి:
    1. సెర్చ్ ఫీల్డ్: మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటిని సెర్చ్ చేయడానికి టెక్స్ట్ ఫీల్డ్.
    2. జనాదరణ సహాయక రిసోర్స్‌లు: మీరు మరొక పేజీని లింక్ చేసే సమాధానాన్ని ఎంచుకోగల ట్యాబ్ చేయదగిన ఫీల్డ్.
    3. అన్ని ఆర్టికల్స్‌ను బ్రౌజ్ చేయండి
    4. సహాయ ఫోరమ్‌కు వెళ్లండి
    5. ఫీడ్‌బ్యాక్‌ను పంపండి

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3830784383358890946
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false